మనిషి సాధారణ శ్రేయస్సులో కీలకమైన అంశంగా మానసిక ఆరోగ్యాన్ని గుర్తించారు. ఇది సానుకూల మార్పు. ఇంకా చాలా పరిశోధన, కృషి చేయాల్సి ఉంది. అయినా, ఇప్పటికే జరిగిన కొద్దిపాటి పురోగతిని నిపుణులు గుర్తించి విలువైనదిగా భావిస్తున్నారు. ఈ మార్గంలో, హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకోవడం, గుర్తించడం ఛాలా ముఖ్యం. అవసరమైనప్పుడు మీ కోసం లేదా మీకు దగ్గరగా ఉన్న ఇతరుల కోసం సహాయం అడగడం కూడా అంతే కీలకం. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శ్వేతా పూరిని సంప్రదించగా.. మనిషి మానసిక ఆరోగ్యాన్ని చూసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలను, అలాగే చేయకూడని వాటిని గురించి వివరించారు.