ప్రధాని సభల విజయవంతంతో లోకేష్ పై మోదీ ప్రశంసలు
ప్రధాని మోదీ పక్కనే టిడిపి యువనేత లోకేష్ కి స్థానం
అమిత్ షాతో భేటీ…ఏపీలో వైసీపీ అరాచకాల వివరణ
అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభ సమయంలో తన నాయకత్వ పటిమను ప్రదర్శించి కేంద్ర పెద్దలతో శెహభాష్ అనిపించుకున్నారు. టిడిపి, జనసేన అలయెన్స్ కుదర్చడం..అనంతరం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం వెనుక లోకేష్ రాజనీతిజ్ఞత బయటపడింది. టిడిపి,బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడ్డాక.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి లోకేష్ సభలలో పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని పాల్గొన్న సభలు విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన నారా లోకేష్ ని నరేంద్ర మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేష్ కి స్థానం ఇచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, బీసీలైన పద్మశాలీయుల కృషి-సృజనాత్మక కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు నారా లోకేష్. వయస్సులో చిన్నవాడైనా, పెద్దల్ని గౌరవించడంలో మాత్రం ఉన్నతంగా నిలిచాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు, సభలు విజయవంతం చేయడంతో దేశవ్యాప్తంగా లోకేష్ పేరు మారుమోగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీచేసిన పార్లమెంటు స్థానం పరిధిలో తెలుగువారున్న ప్రాంతాల్లో నారా లోకేష్ ని ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ తీసుకెళ్లడం లోకేష్ పట్ల వారికున్న నమ్మకానికి నిదర్శనం.