పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి రాంబాబు
నరసరావుపేట బ్యూరో ప్రతినిధి : పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగింది. శనివారం అర్ధరాత్రి వరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో విచారణ కొనసాగగా ఆదివారం గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో సిట్ అధికారులు ముమ్మర విచారణ చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లర్లు జరిగిన సమయంలో వీడియోలను అధికారులు పరిశీలించారు. ఇదే సమయంలో కారంపూడి పోలీస్స్టేషన్లోనూ దర్యాప్తు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన కేసుల రికార్డులను పరిశీలించారు. స్థానిక సీఐ నుంచి సిట్ డీఎస్పీ రామ్మూర్తి వివరాలు సేకరించారు.