విజయవాడ బ్యూరో ప్రతినిధి : పశ్చిమ నియోజకవర్గం లో సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందర్య 39వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో 37వ డివిజన్ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో స్వాతంత్ర సమరయోధులు, భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా కార్మకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఫ్లోర్ లీడర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ ప్రజలందరికీ పని, విద్య, వైద్యం, కష్టానికి తగిన ఫలితం అందించే పాలన వస్తేనే దేశం, రాష్ట్రం, ప్రజల అభివ అద్ధి అవుతారని, అందుకు సుందరయ్య చూపిన మార్గమే అనుసరించాలని తెలిపారు. నీలి వంతమైన రాజకీయాల కోసం సుందరయ్య మార్గం, దేశ లోకిక వ్యవస్థ పరిరక్షణకై, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ సుందరయ్య ఆశయ సాధనతో ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుండని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఆయ్యాలకొండ, లక్ష్మి, సుబ్బారావు, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.
51వ డివిజన్లో : 51వ డివిజన్ అంజనేయవాగు సెంటర్లో మట్టి, లిఫ్ట్, కటింగ్ సిఐటియు ఆధ్వర్యంలో, నెహ్రూ భోమ్మ సెంటర్లో సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె. సూరిబాబు ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. వాగు సెంటర్లో సిఐటియు నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, నెహ్రూ బొమ్మ సెంటర్లో సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నోటు పుస్తకాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, గొలుసుల రాజు, వెంకట్రావు, ఏ శ్రీసు, జి. వెంకట్రావు, సూరా కనకారావు పాల్గొన్నారు.
50వ డివిజన్లో : 50వ డివిజన్ అరుణా కాన్వెంట్ సెంటర్, అలాగే కాదర్ సెంటర్లో సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం. కొండా రెడ్డి, గాదె సుబ్బారెడ్డి, రాజు, దుర్గారావు పాల్గొన్నారు.
కేఫ్ సెంటర్లో : శంకర్ కేఫ్ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు జి. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ. వెంకటేశ్వరరావు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామయ్య, సిహెచ్ దాసు, ఏడుకొండలు, రాజయ్య, సంపర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 40, 45 డివిజన్ సిపిఎం కమిటీల ఆధ్వర్యంలో సితార సెంటర్లో సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బి సత్యబాబు, 40వ డివిజన్ సెక్రెటరీ ఏ సీను, సీనియర్ నాయకులు బి పుల్లారావు, సుదర్శన్, విక్రం లక్ష్మీ, అప్పలరాజు, మస్తాన్, సురేష్, పి ప్రసాద్ తదితరులు పాల్గన్నారు. 31, 35 డివిజన్లలో సుందర్య వర్ధంతి కార్యక్రమాలు అదిగాయి ఈ కార్యక్రమంలో రోశయ్య, కోటేశ్వరరావు కాక్టర్ వామాక్షారావు, నారాయణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మ్యాంగో మార్కెట్లో సిఐటియు ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. గోవిందు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వించిపేట నైజాంగేట్ సెంటర్లో సుందరయ్య వర్గంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, జానీ, బాబురావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 49వ డివిజన్లో సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది దుర్గారావు, గుడప్ప, సూర్యనారాయణ, భార్గవ్, వెంకన్న, దేవి తదితరులు పాల్గొన్నారు. మున్సిషల్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో వైయస్సార్ కాలనీలో సందరయ్య వర్ధంతి జరిగింది, స్వామి, రవి, యోహాన్, గణేష్, పైకి రాజు తదితరులు పాల్గొన్నారు.