చంద్రబాబు బూటకపు హామీలు…అబద్దపు మాటలను ప్రజలు నమ్మడం లేదు
అధికారం కోసం టిడిపి కూటమి అడ్డదారులు
డిప్యూటీ సీఎం, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్
జలుమూరు బ్యూరో ప్రతినిధి : ప్రజలను మరోసారి మోసగించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని, ప్రజలెవ్వరు చంద్రబాబు కూటమి మాయ మాటలు అబద్ధపు హామీలు వినే పరిస్థితుల్లో లేరని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. బుధవారం జలుమూరు మండలం చల్లపేట, రావిపాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పైన ప్రజలెవరికి విశ్వాసం లేదని, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీద అసలు నమ్మకమే లేదని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను తెలుగు దేశం పార్టీ వెబ్సైట్ నుండి తొలగించిన విషయం ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని, మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదైతే వైయస్సార్ మేనిఫెస్టో నీ ఒక భగవద్గీతగా కురాన్ గా బైబిల్ గా భావించి 99శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఇప్పటికే బలంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరూ మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ మద్దతుగా నిలవాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను కూడా గెలిపించుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉందని, నాకు వేసిన ప్రతి ఓటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ కు కూడా వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా చల్లవానిపేట రావిపాడు పంచాయతీల్లో ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణ దాస్ కు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు దాస్ అన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని దాస్ అన్న వెంట నడిచారు. ఇంటింటా నుదుటి తిలకాలు పెట్టి కర్పూర హారతులు ఇచ్చారు. మహిళల సైతం వైయస్సార్ కండువాలు కట్టుకొని భుజాన వైసిపి జెండాను ఎత్తుకొని ఫ్యాను గుర్తుకే మన ఓటు అంటూ నినాదించారు. అలాగే ఈ ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడు (పెదబాబు) కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీ కృష్ణ, పిఎ సిఎస్ అధ్యక్షులు పాగోటి రాజప్పలనాయుడు, మొజ్జాడ శ్యామలరావు, జేసి ఎస్ కన్వీనర్ ధర్మాన జగన్, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విటల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు, మాజీ పిఎ సిఎస్ అధ్యక్షులు బుక్కా లక్ష్మణరావు, ఎంపిటిసి పోన్నాడ విజయ్ కుమార్, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి గురువిల్లి రమణి, యువజన విభాగం అధ్యక్షుడు జుత్తు నేతాజీ, కోన దాము, దాము మన్మధరావు, ధర్మాన రమణ, తర్ర జీవరత్నం, వాన గోవిందరావు, అలాగే స్థానిక నాయకులు, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.