అక్రమ రవాణా బాధిత మహిళల ఫోరం వినతి
తిరుపతి బ్యూరో ప్రతినిధి : మానవ అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోను, కుటుంబం, సమాజం, ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కళంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసం తోపాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితి లో బ్రతుకులు వెళ్ళదీస్తూ ఉన్నారని వీరి సమస్యల పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టో లో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమాక్య “విముక్తి” తమకు మద్దతు ఇచ్చే స్వచంద సంస్థలతో కలిసి తమ డిమాండ్ల చార్టర్ ను విడుదల చేశారు. రాజకీయ పార్టీలు ఏవీ మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోతే లేదా వారి నుండి మాకు తగిన హామీ లభించకపోతే, ఓటు వేసేటప్పుడు నోటాను ఎంచుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదని విముక్తి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం లో విముక్తి రాష్ట్ర కార్యవర్గ సబ్యురాలు రజని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2022 నాటికీ రాష్ట్రంలో షుమారు 1.40 లక్షల మంది వ్యభిచారం లో ఉన్నారని, దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానం లో ఉందని అంటూ ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారు. 10 నుంచి 15 శాతం మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. ఇదేవిధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు కూడా 10 శాతం వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముక్యంగా అక్రమ రవాణా భాదిత మహిళలకు, సెక్స్ వర్కర్స్ కు పునరావాసం కల్పించడం లోను, వారికీ నష్టపరిహారం అందించి వీరిని జనజీవన స్రవంతి లో చేర్చడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. విముక్తి రాష్ట్ర ఉప కార్యదర్శి శాంతి మాట్లాడుతూ “వృత్తితో సంబంధం లేకుండా, ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని చెప్పనవసరం లేదు.” అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదు, ఫలితంగా వారు, వారి పిల్లలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోయి తమ పనికి సంబంధించిన సామాజిక కళంకాన్ని భరించి, సమాజంలోని వివక్ష కు గురికాబడుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ వీరి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం మరియు ఉద్యోగాలలో ప్రవేశం,వీసేవల రంగంలో కెరీర్ అవకాశాలు వంటి ప్రజా సంక్షేమ సేవలను పొందటంలో వారు తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న పార్టీలు లేదా అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విముక్తి రాష్ట్ర సమాక్య నిర్ణయించిందని ఆమె అన్నారు. విముక్తి రాష్ట్ర నాయకురాలు లక్షి ప్రసన్న మాట్లాడుతూ విధాన రూపకల్పనలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో విధాన రూపకల్పనలో పాల్గొనే ప్రభుత్వ సంస్థల తో పాటు సెక్స్ వర్కర్స్ లేదా అక్రమ రవాణా బాధితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేసింది. ఆరోగ్య, సామాజిక సంక్షేమం, స్త్రీలు శిశు అభివృద్ధి వంటి సమస్యలను పరిష్కరించడంలో అందరితో పాటు ఈ వర్గాన్ని కూడా పరిగణలోకి సంబంధిత ప్రభుత్వ సంస్థలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. “మాకు అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయరు. బతుకుదెరువు కోసం కష్టపడుతున్నాం. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడగడానికి వస్తారు. నోటా మాకు బెస్ట్ ఆప్షన్” అని మరో విముక్తి నాయకురాలు శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్ పత్రంలో బాధితులకు కమ్యూనిటి ఆధారిత పునరావాసం కల్పించాలని, ప్రాథమిక సేవలు, విద్య, 40 ఏళ్ల దాటిన ప్రతి సెక్స్ వర్కర్ కు పెన్షన్ సుదుపాయం కల్పించాలని, భాదిత మహిళల అందరికి నష్టపరిహారం 3 నెలలో అందేలా చూడాలని, అక్రమ రవాణా వ్యవస్థను ఎదుర్కోవడానికి ఒక బలమైన కొత్త వ్యవస్థ కోసం చట్టం రుపొందిచాలని, రాష్ట్రం లో కోతగా ఏర్పాటు చేసిన యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ నేరుగా అక్రమ రవాణా కేసులు చేపట్టేలా చూడాలని, ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు వాటి అమలు, పర్యవేక్షణ వంటి కార్యక్రమాల్లో సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా భాదితులను పాల్గొనేలా చర్యలు చేపట్టడం తో పాటు తొమ్మిది డిమాండ్లు వినతి పత్రం లో ఉన్నాయి. ఈ సమావేశం లో హెల్ప్ సంస్థ కార్యదర్శి రామమోహన్ నిమ్మరాజు, హెల్ప్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఓ. నితిన్, తదితరులు పాల్గొన్నారు.