విజయవాడ, ప్రధాన ప్రతినిధి : అమరావతి కాపునాడు వైస్సార్సీపీ మద్దతు ఇస్తూ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు స్థానిక ఆంధ్రప్రభ కాలనిలో గల వైస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కబాడీ శ్రీను మాట్లాడుతూ అమరావతి కాపునాడు వైస్సార్సీపీ కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎవరు చెయ్యని విధంగా జగన్ మోహన్ రెడ్డి కాపులకు మంచి చేసారన్నారు. కాపులకు పెద్ద పిటా వేసింది జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు.కాపులు టీడీపీకి ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. సెంట్రల్ లో వెలంపల్లి గెలవబోతున్నాడన్నారు. బోండా ఉమా ఇక్కడ గెలిచేది వెలంపల్లి రాసుకో అని సవాలు విసిరారు. భారీ మెజారిటీతో వెలంపల్లి గెలుస్తాడని తెలిపారు. బోండా ఉమా ఒడిబోతున్నాడని, నామీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అయిన వెలంపల్లి తో ఉంది అయన గెలుపు కోసం పని చేస్తానని తెలిపారు. 20వేల ఓట్ల మెజారిటీ తో వెలంపల్లి గెలవబోతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కాపులకు మంచి జరిగిందన్నారు. అందుకని నేడు వైస్సార్సీపీ కి, వెలంపల్లికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాల్లో నా ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. టీడీపీ వాళ్ళు అంత నా ఇంటి చుట్టూ తిరిగారు పార్టీలో చేరమని కానీ చెన్నుపాటి శ్రీను వల్ల నేను వైస్సార్సీపీ కి మద్దతు ఇస్తున్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు బావిశెట్టి రమేష్, బసవ నారాయణ,మల్లిక్ రమేష్,గంటా ఫణి,దుక్క మురళి తదితరులు పాల్గొన్నారు.