వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిల వైఖరిపై ఫిర్యాదు
రాష్ట్రంలో ఉన్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకోవాలి
ఎన్నికల విధుల్లో ఉన్న ఓపిఓలు, ఇతర ఓటర్లకు సంబంధించి ఫారం-12, పోస్టల్ బ్యాలెట్ పత్రాల సమర్పణ తేదిని పొడగించాలి
పోలింగ్ అధికారుల కోసం జిల్లాకో సెంటర్ కాకుండా ప్రతీ నియోజకవర్గానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి
ఎన్నికల అధికారులపై బెదిరింపులకు దిగి ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
విద్యార్ధులను ప్రభావితం చేసేలా సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి హాజరు కావాలని 800 మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపించిన వీసీ ప్రసాద్ రెడ్డి
టీడీపీ నేతలు దేవినేని ఉమా, పరుచూరి అశోక్ బాబు
వెలగపూడి : ప్రభుత్వ ఉద్యోగుల ఫారం-12 పత్రాల సమర్పణ తేదీని పొడగించాలని, ప్రతీ ఒక్క ఉద్యోగి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరిన మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. ఎన్నికల అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న అధికార వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి దేవినేని ఉమా
నామినేషన్ వేయడానికి వెళ్ళి మహిళా అధికారిణి బెదిరించిన ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల అధికారులపై బెదిరింపులకు దిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి హద్దుఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎన్నికల నియమావళి ఉల్లంగించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ప్రసాద్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలి. ఆర్వో, మహిళా రిటర్నింగ్ ఆఫీసర్, తహశీల్దార్ల పట్ల మీకు ఇంకా సర్వీస్ ఉంది.. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తించిన తీరు వైసిపి నేతల బరితెగింపుకు నిదర్శనం. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోమని ఈసిని కోరాం” అని తెలిపారు.
“ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదులు చేశాం. ఈమర చేసిన ఘనకార్యాలకు మూడోసారి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా నియమించారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన వీసీ ప్రసాద్ రెడ్డి విద్యార్ధుల చేత వైసీపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తుంటాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఎచీవర్స్ డే సమావేశం నిర్వహించాడు. ఏమి ఎచీవ్ చేశాడో తెలియదు కానీ ఎచీవర్స్ డే అంటూ విద్యార్ధులను ప్రభావితం చేసేందుకు సమావేశం నిర్వహించాడు. 800 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమావేశానికి హాజరుకావాలని నోటీసులు పంపించారు. గతంలో కూడా సర్వేల పేరుతో పిల్లలను గ్రామాల్లోకి పంపినట్లు ఇతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఇతనిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నకల సంఘానికి మరోమారి ఫిర్యాదు చేశాం” అని తెలిపారు.
ఫారం-12పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్సీ అశోక్ బాబు
“ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పత్రాల సమర్పణ ప్రక్రియ 26 తేదీతో ముగియనున్నది. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సమాచారం అందలేదు. కావున 26వ తేదిని పోడిగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. నోడల్ ఆఫీసర్లు గురించి కూడా అనేక మంది ఉద్యోగులకు వారు ఎవరో కూడా తెలియదు. 25 జిల్లాలకు నియమించిన నోడల్ ఆఫీసర్ల పేర్లు, అడ్రెస్లు, ఫోన్ నెంబర్లు వెబ్ సైట్లో పెట్టాలి. నోడల్ ఆఫీసర్ల నియమకం గురించి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయండని ఎన్నికల కమిషన్‌ను కోరాం. పోలీసు శాఖలోని ఉద్యోగులందరికి ఫారం-12 ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ సెవను కల్పించాలి. నాన్ గవర్నమెంట్ సర్విస్‌లో పని చేస్తున్న డ్రైవర్లు, ఈవిఎం మెకానిక్‌లు, వీడియో గ్రాఫర్లు వంటి వారిని ఇంతవరకు నియమించుకోలేదు. వీరిని నియమించుకున్న రోజు నాటికి ఫారం-12 పత్రాల సమర్పణ ముగిస్తే వారు తమ ఓటును వినియోగించుకోలేరు. దీనిపై కూడా సమీక్షించాలని ఈసీని కోరాం. పీవోలు, ఏపీవోలకు ట్రైనింగ్ సెంటర్లోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకుంటారు. మిగిలిన పోలింగ్ అధికారులకు కూడా జిల్లాకు ఒకటి కాకుండా ప్రతీ నియోజకవర్గానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. మొత్తం 6 లక్షల వరకు ఫారం-12 పత్రాలు ఇవ్వాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన లేక గతంలో వేల ఓట్లు ఇన్ వాలిడ్ అయినవి. ఇప్పుడు ప్రతీ ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పించి వారి ఓటు ఇన్ వాలిడ్ కాకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. తప్పకుండా ఈ విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘంతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు”అని అశోక్ బాబు తెలిపారు.
ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రివర్యలు దేవినేని ఉమా, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీఎల్పీ కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.