ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
ఐక్య వేదిక చైర్మన్ కె ఆర్ సూర్య నారాయణ
విజయవాడ బ్యూరో ప్రతినిధి: ఎన్నికల ప్రవర్తనా
నియమావళి పేరుతో
ఉద్యోగుల్లో భయాందోళనలకు గురిచేసేలా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఉద్యోగులు ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావాలిలో స్వేచ్ఛగా మాట్లాడుకోకూడదని అంతర్గత సమావేశాలు పెట్టకూడదని రకరకాల ఊహాగానాలు భయాలు సృష్టిస్తున్నారని వీటన్నిటినీ తొలగించడానికి రాజ్యాంగం, ప్రజలకు ఉద్యోగులకు కల్పించిన హక్కులను తెలియ పరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక కృషి చేస్తుందని ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల అంతర్గత సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని ఐక్యవేదిక చైర్మన్ కె ఆర్ సూర్య నారాయణ పేర్కొన్నారు. మాకినేని బసవపు అన్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందు జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజ్యాంగం ప్రజలకు ఉద్యోగులకు అనేక హక్కులు కల్పించిందని ఎన్నికలవేళ ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా తమ ప్రాథమిక హక్కులను విధులను చర్చించుకునేలా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి లో పేర్కొందని ,
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేవలం రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే వారికి మాత్రమేనని ఇది ఉద్యోగుల అంతర్గత సమావేశాలకు వర్తించదని మా సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన గాని, పార్టీల పేరుగాని ఉండదని కేవలం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల అన్వేషణ గురించి మాత్రమే చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై పూర్తి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సమయంలో ప్రజలకు జవాబు దారిగా ఉండేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులేనని వారి యొక్క హక్కులను కాపాడే ఉద్యోగులే తమ హక్కులు ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే సమాజం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో
ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లైన సిపిఎస్ జిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ 12వ పిఆర్సి సత్వర అమలు, సకాలంలో డిఏ ల చెల్లింపు, 25వేల కోట్లు పైగా ఉన్న పెండింగ్ పిఆర్సి ఎపిజిఎల్ఐ బకాయిల చెల్లింపు, ఒకటో తేదీనే జీతాలు ,పెన్షన్ చెల్లింపు చట్టబద్ధం చేయడం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆప్ పెన్షన్ అమలు ,మెరుగైన ఎంప్లాయిస్ హెల్త్ స్కీము అమలు, ఉద్యోగులకు, ఉపాధ్యాయుల కు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకి శాశ్వత పరిష్కారం మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ రూల్స్ అమలు తదితర సంస్థాగత సమస్యల పరిష్కారం ,ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు అనే సమస్యలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రెటరీ జనరల్ బాజీ పఠాన్ , వైస్ చైర్మన్లు పాపారావు కేదారేశ్వర రావు, రవీంద్ర బాబు, డిప్యూటీ సెక్రటరీ నరసింహ రావు, జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ రజాక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ కిషోర్ ,నాగ సాయి, విజయ్ , రంగనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.