పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య ఉన్న సందిగ్ధతను ఎన్నికల కమిషన్ తొలగించింది
ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం
*ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ మాదిరి ప్రత్యేకంగా ఒక రోజు స్పెషల్ సి.యల్ మంజూరు చేయాలి
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కే రమేష్ కుమార్, పలిశెట్టి దామోదర్ రావు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఏపీజేఏసీ అమరావతి వినతిపత్రం సమర్పించగా ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ పై స్పష్టమైన మార్గదర్శకాలు జారి చేసిందన్నారు. ఎన్నికల విధులకు కేటాయింపబడిన ఉద్యోగులందరూ వారి వారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం-12 పూర్తీ చేసి సమర్పిస్తే, తదుపరి వారికి ఫెలిసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తుందన్నారు. ఇప్పటి వరకు కొంతమంది అధికారుల మధ్య ఉన్న ప్రధానమైన సందిగ్ధత అంటే ఉద్యోగులు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో వారి వారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ నందు ఓటు వేసేలా సౌకర్యం కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందుకు ఎన్నికల ప్రధాన కమిషనరకి ధన్యవాదాలు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వ జీవో మాదిరి, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల విధులకు హాజరయ్యే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు అందరికీ కూడా మే మొదటి వారంలో ప్రత్యేకంగా ఒక రోజు స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయాలనీ కోరారు.
ఈ నెల 26 వ తేదీ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు చివరి తేదీ కాగా, మే మొదటి వారంలో వారి పోస్టల్ బ్యాలెట్ ఓటును ఫెసిలిటేషన్ సెంటర్ లో వినియోగించుకునే అవకాశం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ఎవ్వరూ వారి ఓటుహక్కును వృధా చేసుకోకుండా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపిజెఏసి అమరావతి , ఏపి రెవిన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర కమిటి తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఏపిజేఎసి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, సహా చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి. మురళీ కృష్ట నాయుడు, ఏపిఆర్ యస్ ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.