విశాఖపట్నం బ్యూరో ప్రతినిధి : విశాఖపట్నం జిల్లా ఎండాడ ఎం వీ వీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి 21వ రోజు బస్సుయాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో భారతీ యజనతాపార్టీ, టీడీపీ, జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతలు చేరారు. భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వి ఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్సి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్ పార్టీ లో చేరారు. అలాగే టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్సీపీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.