నరసన్నపేటలో అభివృద్ధి అంటే ధర్మాన క్రిష్ణదాస్
ధర్మానికి ఓటు వేయండి.. మేలు చేసిన వారిని గెలిపించండి
యారబాడు, వి.ఎన్ పురం పంచాయతీలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు
నరసన్నపేట బ్యూరో ప్రతినిధి :
జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని., నరసన్నపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నరసన్నపేట మండలం యారబాడు , వి.ఎన్ పురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మళ్ళీ గెలిపించాలని వీరు పిలుపునిచ్చారు . నరసన్నపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపించాలని వీరు పిలుపునిచ్చారు ఎల్. ఈ సందర్భంగా మడపాం పంచాయతీల్లోని గ్రామాల్లో యువ నాయకులకు బ్రహ్మ రథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్ జెడ్పీటీసీ చింతు రామారావు, పిఎసిఎస్ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న , జేసి ఎస్ కన్వీనర్ సురంగి నర్సింగరావు, అటవీ శాఖ డైరెక్టర్ బొబ్బాది ఈశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవికుమార్ ఉపాధ్యక్షుడు బగ్గు రమణయ్య జేసీఎస్ కన్వీనర్ సురంగి నర్సింగరావు , జిల్లా ప్రచార కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు, యువజన విభాగం అధ్యక్షుడు పాగోటి గోవిందరావు పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి చల్ల శ్రీనివాసరావు, ఉర్లాం సర్పంచ్ పోలాకి నరసింహమూర్తి, పోలాకి రమణయ్య, మండలం మహిళా అధ్యక్షురాలు పుట్టా ఆదిలక్ష్మి, స్థానిక సర్పంచ్ యాబాజీ రమేష్, ఎంపీటీసీ సురవరం పాపినాయుడు నరసన్నపేట మండలం సర్పంచులు ఎంపీటీసీలు, మరియు మండల సర్పంచులు ఎంపీటీసీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.