విజయవంతం చేయాలి
జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ పిలుపు
శ్రీకాకుళం, ఏప్రిల్ 10 :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి, ఆత్మీయ సమావేశాన్ని ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆరంభమయ్యే ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి, కో కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలు, నియోజకవర్గ పరిశీలకులు, బీసీ కార్పొరేషన్లు, ఏపీ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల పార్టీల అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు అంతా హాజరుకావాలని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు.