విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్నోఏళ్ళుగా వేసవిలో పాదచారుల దాహార్తిని తీరుస్తున్న మీనాక్షి కన్స్ట్రాక్షన్స్ అధినేత పెద్ది రమేష్ సేవలు ఎంతో హర్షణీయమని సీనియర్ జర్నలిస్టు యేమినేని వెంకట రమణ అన్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న రమేష్ కార్యాలయం వద్ద మంగళవారం చాలివేద్రం ని యేమినేని చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యేమినేని పెద్ది రమేష్ సామాజిక సేవలను గుర్తుచేశారు. ఇటీవలే కొత్తపేట లోని షేక్ రాజా సాహెబ్ ప్రసూతి (మినీ జనరల్) ఆసుపత్రిలో రోగుల చౌకర్యార్ధం రూ 1.50 లక్షల వ్యయంతో రేకుల షెడ్ నిర్మించారని, గుడులు, గోపురాలు, నిర్మాణానికి భూరి విరాళాలు ఇచ్చారని, సుమారు 15 ఏళ్ళగా వేసవి కాలం వచ్చిందంటే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ప్రజలు రమేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో కూలింగ్ నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నారని రమణ వివరించారు. భవన నిర్మాణ రంగంలో వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న రమేష్ ప్రజాసేవల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగం బిల్డర్లు, మేస్త్రులు, కార్మికులు నల్లబిల్లి శ్రీనివాసరావు, కరణం పార్ధు, నాగోతి (ఉంగరాల) శ్రీను,రాంపిళ్ల వెంకటేష్, కత్తెర సురేష్, తామాడ తురుపతరావు, దాసరి ఏసు,గంగిరెడ్డి భాస్కరరావు,జీ గణేష్, జగదీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.