సారవకోట మండలం ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
సారవకోట బ్యూరో ప్రతినిధి : జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సారవకోట మండలం, సవరడ్డ పనస, వెంకటాపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గతంలో దొంగ హామీలు ఇచ్చి మహిళలకు అన్ని వర్గాల ప్రజల కు మొసం చేసారని అన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మానిఫెస్టో ను 99 శాతం అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచారానికి ప్రజలు నుండి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, దేవీప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ నక్క తులసీదాస్, పారశెల్లి తేజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటి నాయుడు,వెలమల సింహాచలం, కోరాడ అప్పయ్య,రావాడ భాస్కరరావు, తంగి రమణ, యాళ్ళ శ్యామ్ సుందర్, నిక్కు రాజశేఖర్, కోండాల బాబూరావు, కోరుకొండ శంకర్రావు, రంజీత్, చెంచల సింహాచలం తదితరులు పాల్గొన్నారు.