పారశెల్లి, తెలగవలస పంచాయతీల్లో జన జాతరలా క్రిష్ణదాస్ ఎన్నికల ప్రచారం
రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్
నరసన్నపేట బ్యూరో ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతో మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం నరసన్నపేట మండలం పారశెల్లి, తెలగవలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు . పేద ప్రజలకు మేలు చేసిన జగనన్నకు, దాసన్నకు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో క్రిష్ణదాస్ కు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడులకు బ్రహ్మ రథం పట్టారు. ఇంటింటా నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన కావాలంటే అందరూ ప్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచారం లో మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రచార రథం ముగ్గు డాన్సులు చేశారు. ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కి, మరో ఓటు మన ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కి వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్ జెడ్పీటీసీ చింతు రామారావు, పిఎసిఎస్ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ గుప్త, జేసీఎస్ కన్వీనర్ సురంగి నర్సింగరావు, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి కుమార్, ఉపాధ్యక్షుడు బగ్గు రమణయ్య, యువజన విభాగం అధ్యక్షుడు పాగోటి గోవిందరావు, జిల్లా ప్రచార కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు, మహిళా అధ్యక్షురాలు పుట్టా ఆదిలక్ష్మి, స్థానిక సర్పంచ్ ఆడంగి సూర్యనారాయణ, పూలసారి అప్పన్న, సర్పంచులు ఎంపీటీసీలు, పంగ శ్రీరాములు, కొంక్యణ నర్సింహా మూర్తి, మల్లా విశ్వనాథం, అల్లు అసిరినాయుడు, మాజీ పిఎ సిఎస్ అధ్యక్షులు పాగోటి ప్రభాకర్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పతివాడ గిరీశ్వరరావు , పట్టణ పార్టీ అధ్యక్షులు పోట్నూరు సాయిప్రసాద్, కోఆప్సన్ సభ్యులు రమణ సాహూ, పోలాకి నర్సింహామూర్తి, డోల గోవిందరావు, కింతలి చలపతి రావు, మొయ్యి లక్ష్మునాయుడు, మంతిన రాము, డేవిడ్, అంధవరపు పాపారావు ,పెదిరెడ్ల రాము, రువ్వ వాసు సురవరం పాపినాయుడు, అంపోలు సుధ, పాగోటి భరద్వాజ్, సతివాడ రామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.