వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం కక్షపూరిత ధోరణి– ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ ను 1వ తేదీ ఇవ్వద్దని కోర్టుకు, ఈసీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు అడుగడుగున ప్రజల బ్రహ్మరథం
18వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న ప్రజలు
జనసంద్రంగా మారిన సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతం
ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు భారీ స్వాగతం అందించిన 18వ డివిజన్ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, ప్రజలు
1వతేదీ టంఛన్ గా ఉదయం 6 గంటలకే పింఛన్ అందించే వాలంటీర్లపై టిడిపి కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అవ్వతాతలు, వికలాంగులకు సకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా పింఛన్లు అందించే వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశంపార్టీ కోర్టుకు, ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల వ్యాఖ్యానించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ దురాగతాలకు ప్రజలు చమరగీతం పాడడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రజల నుండి భారీగా మద్దత్తు లభిస్తుంది. ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం 18వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ టి అశోక్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడప గడప ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు, వైయస్సార్సీపీ శ్రేణులు భారీ స్వాగతం అందించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రతి ఇంటి గడప తొక్కి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జరిగిన మేలును, అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఒక్కొక్క కుటుంబానికి ఏ సంక్షేమ పథకాలు అందాయి అనే వివరాలను క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి చేరుకున్న వైసిపి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానిక ప్రజల నుండి మంచి ఆదరణ, ఆప్యాయత లభించింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నుండి తనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాల పట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం లబ్ధి ప్రతి ఇంటికి చేరిందన్న విషయం స్థానిక ప్రజల మాటల్లో వ్యక్తం కావడం మంచి కీలక పరిణామం అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిళ మొయిల్ల గౌరీ, జే సి ఎస్ దారా వంశీ, మారం రెడ్డి కుమార్ రెడ్డి రామకృష్ణారెడ్డి, ఎద్దాల వెంకటేశ్వర్లు రెడ్డి, పుట్టా విజయ్ కుమార్ రెడ్డి, పఠాన్ బాబు, షబీర్, అంకయ్య, ఖాదర్, సీనయ్య కార్తీక్ మురళి రియాజ్, మల్లి, వరదయ్య, వెంకటేశ్వర్లు, పెద్దమ్మ, గౌరీ, చాన్,
స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.