33వ డివిజన్లో ఆదాల హిమబిందు ఎన్నికల ప్రచారం
చక్కటి వాక్దాటితో ప్రజలను ఆకర్షిస్తున్న ఆదాల హిమబిందు
ప్రతి గడపలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు మద్దత్తుగా అభివృద్ధి మంత్రం వినిపిస్తున్న ఆదాల హిమబిందు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రానున్న ఐదేళ్ల కాలంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిన
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వలనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 33వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నేతాజీ నగర్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించారు. ఇంటింటా ఎన్నికల ప్రచార పర్వములో దూసుకుపోతున్న ఆదాల హిమబిందును స్థానిక ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఆమె చక్కటి చిరునవ్వుతో, మంచి వాగ్దాటితో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను, గడిచిన 10 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తున్న ఆమె తీరును ప్రజలు కొనియాడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు ఓటు నెల్లూరు రూరల్ ప్రాంత అభివృద్ధికి రాచబాటని ఆదాల హిమబిందు ప్రజలకు సూచించారు. 33వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాల హిమబిందు సమక్షంలో డివిజన్ ఇంచార్జి మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా అభినందిస్తూ వారిని వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని ఆదాల హిమబిందు చెప్పారు. తన తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంతగానో ఆదరిస్తున్న నెల్లూరు రూరల్ ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఆదాల హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా నల్ల తంబీ మేరీ, సిమోను, శ్రీదేవమ్మ, రంగనాయకమ్మా, లక్ష్మి, ప్రేమ్, వాసు, వెంకటేష్, తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డివిజన్ ముఖ్య నాయకులు అశోక్ దాసు, మోషే, వెంకటేశ్వర్లు, పవన్, శ్రీను, అశోక్, తదితరులు మైనారిటీ నాయకులు, షమిమ్ భాయ్ , ముజమిళ్ కాజా, ఇర్షాద్, తదితలతో పాటు ఏపీ స్టేట్ ఎమ్మెస్ఎమ్ఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, క్లస్టర్-1 ముడియాల రామిరెడ్డి, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, వై శ్రీనివాసులు రెడ్డి, పాశం వెంకటేష్ స్థానికనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.