స్వచ్ఛందంగా పార్టీలో చేరడం అభినందనీయం — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
నెల్లూరు రూరల్ వైసీపీలోకి వలసల ప్రవాహం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 34వ డివిజన్ నుండి వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 34 డివిజన్ ఇన్చార్జి షేక్ రియాజ్ ఆధ్వర్యంలో కొండలరావు, పెంచలయ్య తదితరుల మిత్రబృందం 50 కుటుంబాల వారు ఆదివారం రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా పార్టీలో చేరారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా వైసీపీలో చేరేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందించి, వారికి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.