మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
ఐతవరంలో వసంతతో నేతల ఆత్మీయ కలయిక.
ఎన్టీఆర్ జిల్లా, ఐతవరం, 31.03.2024.
బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి అఖండ విజయం చేకూర్చాలని ఇందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని యుద్ధంలో సైనికుల్లా పోరాడాలని మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.
ఐతవరంలోని ఎమ్మెల్యే కేపీ గారి నివాసంలో పలువురు నేతలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల ఆత్మీయ కలయికలతో ఎమ్మెల్యే కేపి గారి నివాసం కోలాహలంగా మారింది. పార్టీ నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.అధికారంలోకి వచ్చాక మైనింగ్ దోపిడీపైనే తొలి విచారణ!
5ఏళ్లలో అన్ని పాలనా వ్యవస్థలను జగన్ ధ్వంసం చేశారు.
వాలంటీర్ వ్యవస్థ సేవలను సమర్థవంతంగా వినియోగిస్తాం.
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్.
మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక గత అయిదేళ్లుగా జె-గ్యాంగ్ యథేచ్చగా సాగించిన మైనింగ్ దోపిడీపైనే మొట్టమొదటగా విచారణ జరుపుతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో యువనేత ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అయిదేళ్ల జగన్ పాలనలో జ్యుడీషియరీ తప్ప అన్ని పాలనా వ్యవస్థలను ధ్వంసం చేశారు, ముఖ్యంగా మైనింగ్ శాఖలో లేనివి ఉన్నట్లుగా చూపి భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ జిటి ఆదేశాలను సైతం బేఖాతరు చేసి సహజవనరులను విచ్చలవిడిగా దోచుకున్నారు. వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సరళతరమైన ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణరంగానికి గత వైభవం తెస్తాం. విశాఖలో రుషికొండ, ఉండవల్లిలో సహజసిద్ధమైన కొండలను పిండిచేసి సొమ్ముచేసుకున్నారు. మూడు రాజధానుల పేరుతో నాటకమాడిన జగన్ అయిదేళ్లుగా ఏ ఒక్క ప్రాంతంలో ఒక్క ఇటుకవేసిన పాపాన పోలేదు. ఆయన మాత్రం 500 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నాడు. జగన్ సర్కారు అరాచకాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇటీవల విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 11 కేసులు పెడతామని అంటున్నారు. బాంబులకే భయపడిన కుటుంబం మాది, మీ తప్పుడు కేసులకు భయపడతామా? చంద్రబాబు గారికి రాష్ట్ర అభివృద్ధిపై తప్ప డబ్బు సంపాదనపై ధ్యాస లేదు. అలా ఉండి ఉంటే హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు వెయ్యి ఎకరాలు, అమరావతి రాజధానిగా ప్రకటించే ముందు 500 ఎకరాలు కొనేసి ఉండేవారు. అభివృద్ధి, సంక్షేమాలను జోడెడ్ల బండిలా నడిపించాలన్నది టిడిపి సిద్ధాంతం. ఒక్క కియా పరిశ్రమతో అనంతపురం జిల్లా ప్రజల తలసరి ఆదాయం 30వేలు పెరిగింది. కియా వల్ల 50వేలమందికి ఉద్యోగావకాశాలు లభించాయి, రాబోయే రోజుల్లో అలాంటివి వంద తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయిస్తాం. చంద్రబాబు ముందుచూపుతో రెండున్నర దశాబ్ధాల క్రితం సైబర్ టవర్స్ నిర్మాణంతో ఐటిని అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ లో 10లక్షలమంది బిడ్డలకు ఉద్యోగావకాశాలు లభించాయి. అదేవిధంగా విశాఖలో ఐటిని అభివృద్ధి చేయాలని లక్షకోట్ల విలువైన అదానీ డాటా సెంటర్ ను రప్పించి, గత ప్రభుత్వంలో భూమిని కూడా కేటాయించాం. ఈరోజు ఆ సంస్థ ఎటువెళ్లిందో తెలియదు. మా మొట్టమొదటి ఎజెండా యువతకు ఉద్యోగాల కల్పన. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టతరమైనా ఆ లక్ష్యాన్ని సాధిస్తాం.
వాలంటీర్ వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దుతాం
రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందజేస్తాం. ఈ వ్యవస్థను స్థానిక సంస్థలతో అనుసందానిస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోంది. రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంక్షేమ వారధిగా ఉండేలా తీర్చిదిద్దుతాం. దశాబ్ధాల కాలం పోలవరాన్ని 72శాతం పూర్తిచేసింది గత టిడిపి ప్రభుత్వమే, అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం. జోన్లవారీగా అధునాతన పంటలను ప్రోత్సహిస్తాం. పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని లోకేష్ చెప్పారు. జగన్ గొప్పనటుడు, ఆయన సినిమాల్లోకి వెళ్లుంటే భాస్కర్ అవార్డు వచ్చి ఉండేది, బాబాయిని లేపేసి నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు.