సారవకోట ప్రచారంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు
సారవకోట బ్యూరో ప్రతినిధి : ప్రజలకు ఎంతో మేలు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగనన్నను, వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషి దాసన్న ను గెలిపించాలని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు కోరారు. శనివారం సారవకోట మండలం కేలవలస , సత్రాం పంచాయితీలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మేమంతా జగనన్నతోనే ఉన్నామంటూ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా సంఖ్యలో జనాలు పైకి వచ్చి జగనన్న పాటలకు డాన్స్ లు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనం గుండెల్లో కొలువైన జగనన్నను మళ్ళీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిన వారందరూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, దేవీ ప్రసాద్, వైస్ ఎంపీపీ గునుపురం రామారావు, పిఎసిఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, స్థానిక సర్పంచ్ లు తంగి రమణ, రావాడ భాస్కరరావు తోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు , స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.