ఇఫ్తార్ విందులో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : స్థానిక మధుర నగర్ నేతాజీ రోడ్ లో శుక్రవారం మస్జిద్ ఏ సిద్ధిఖీ లో జరిగిన ప్రత్యేక నమాజ్ పాల్గొని అనంతరం చాంద్ బాషా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ఉపవాసం చేసిన మైనారిటీ సోదరులకు పళ్ళు తినిపించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ నాడు రాజ శేఖరరెడ్డి తన హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనుడని, నేడు అదే బాటలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తూ ముస్లింలకు అన్నీ రంగాలలో పెద్ద పీట వేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులపై అల్లా ఆశీస్సులు ఉండాలని కోరారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, ఎస్ డి బాబు,మస్జీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గుడ్ ఫ్రైడే సిలువ యాత్రలో పాల్గొన్న వెలంపల్లి : గుడ్ ఫ్రైడే సందర్భంగా సెంట్రల్ నియోజక వర్గం లో పలు చర్చిల నందు నిర్వహించిన సిలువ యాత్ర ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మేల్యే అభ్యర్థి, వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని కొనియాడారు. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం,త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అవుతూ శ్రీనివాస్ రెడ్డి, యర్రగోర్ల శ్రీరాములు, ఇస్మాయిలు, కొక్కిలగడ్డ నాని, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.