నకిలీ కరెన్సీ చంద్రబాబు ఒకటే * సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండుగా కనిపించాయి * వైయస్సార్ సిపి అధికారంలోకి రావడం ఖాయం * ప్రజలలో చెల్లుబాటు కాని వ్యక్తి చంద్రబాబు * తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును చెత్తబుట్టలో పడేశారు * గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోలేదు * సీఎం కార్యాలయంకి వచ్చిన కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి ఉంది * కంటైనర్ లో ఏదో ఉందని దివాళాకోరుతనంతో మాట్లాడుతున్నారు * మీడియా ప్రతినిధులతో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు…నకిలీ కరెన్సీ ఒకటే అని అది ఏవిధంగా చెల్లుబాటు కాదో చంద్రబాబు ప్రజలలో చెల్లుబాటు కారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వైయస్సార్ సిపి అనగానే ప్రజలలో ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుంది. అంతకుముందు సిధ్దం సభలకు కూడా అలాగే ఉంది. మేం ఎప్పుడూ చెబుతూ ఉంటాం. 2019కు ముందున్న హోప్ ఎలా ఉందో నేడు అదే ఆదరణ కనిపిస్తోంది. జగన్ అదికారంలోకి వస్తే జీవితాలు మెరుగవుతాయని ప్రజలు భావించారు. అనుకున్నదాని కంటే మిన్నగా మా ప్రభుత్వం డెలీవర్ చేయడం వల్ల అది రిఫ్లెక్ట్ అవుతుంది. నాలుగు సిధ్దం సభలలోను నేడు వైయస్ జగన్ గారి బస్సు యాత్రలోనూ కనిపిస్తోంది. కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తోంది. లక్షలాది మంది ప్రజలు బస్సుయాత్ర జరుగుతున్న రోడ్లపైనా కనిపిస్తున్నారు. సభలకు హాజరువుతున్నారు. మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని జగన్ ఏదైతే విశ్వాసం ఉంచారో అది నేడు కనిపిస్తోంది. ఏ ధీమాతో అయితే రిక్వెస్ట్ చేశారో నేను మంచి చేశానని భావిస్తే ఆశీస్సులు ఇవ్వండి. అది నిజమని తేలింది.ప్రజలు ఎంతగా జగన్ పై నమ్మకం ఉంచారో కనిపిస్తోందని వివరించారు. రానున్న రోజులలో మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తిని ప్రజలు రిజెక్ట్ చేశారు.మామ ఎన్టీఆర్ నుంచి కబ్జాచేసిన తెలుగుదేశం పార్టీని,చంద్రబాబును రెండింటిని చెత్తబుట్టలో వేసినా సిగ్గురాలేదా అనే ప్రశ్న జనం వేస్తున్నారు.అది జనం అడుగుతారని తెలిసీ కూడా తన చివరిప్రయత్నంగా ఇప్పుడు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు.ఏపి ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు విభజన తర్వాత రాష్ర్టానికి తాను ఏవైతే ద్రోహాలు చేశాడో, ఏఏ పాపాలు చేశాడో, రాష్ర్టాన్ని ఎలా ముంచాడో ప్రజలకు తెలుసు.తాను,తన వారసులు కొన్ని తరాలు తిన్న తరగని విధంగా చంద్రబాబు దోచుకున్నాడు. ఇవన్నీ జగన్ కి ఆపాదించాలని ఈరోజు చూస్తున్నాడు. ప్రజలు చంద్రబాబు ద్రోహాలు గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే తన ఊకదంపుడు మూసలో వెళ్తున్నాడు. తన లక్షణాలను జగన్ కి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని ఆయన సభలకు హాజరవుతున్న ప్రజల సంఖ్య తెలియచేస్తోంది. అదే సమయంలో జగన్ కదిలితే జనం ఎలా ప్రవాహంలా కదిలివస్తున్నారో కూడా చూడవచ్చు. అక్కడే తేడా తెలుస్తోంది. సీఎం కార్యాలయంకు వచ్చిన కంటెనైర్ పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఆర్టీసి నుంచి అధికారికంగా తీసుకున్న వాహనం అది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి ఈసి నుంచి ప్యాంట్రీ కార్ కోసం అనుమతి పత్రం ఇచ్చింది. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం వాహనాలకు సంబంధించి అనుమతులు తీసుకుంటారని తెలిసీ కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై లోకేష్ ట్వీట్ చేయడం పై మాట్లాడుతూ తండ్రి కొడుకులు ఇద్దరూ దుర్వినియోగం చేసినట్లు ట్వీట్టర్ ఫ్లాట్ ఫామ్ ను ఎవరూ దుర్వినియోగం చేసి ఉండరని సజ్జల విమర్శించారు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా వారి వైఖరి ఉందన్నారు. శ్రీకాళహస్తిలో మా పార్టీ అధికారికంగా తీసుకున్న గౌడౌన్ లో టాక్స్ లు కట్టి తెచ్చిన సరుకు పెట్టుకున్నా కూడా నానా యాగి చేసారు. చివరకు మా పార్టీ ఆఫీసుకు కూడా వస్తారేమో అన్నట్లుగా ఉంది. అప్పుడు మేం కూడా టిడిపి కార్యాలయంకు వెళ్లాలేమో అని వ్యాఖ్యానించారు. ఆర్టీసిలో ప్యాంట్రీ కార్ అధికారికంగా తీసుకున్న, బిల్లులు చెల్లించి ప్రచార సామాగ్రి తెచ్చినా దానిపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి మీడియా ఉంది కదా అని ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఇది దివాళాకోరుతనం అన్నారు. ఎన్నికలలో వారి అజండా ఏంటో ప్రజలకు చెప్పకుండా వారికి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఏం చెప్పాలన్నాకూడా లేదు. వాళ్లు వెళ్తే జనం ఛీ కొడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్దితి లేదన్నారు. ఇలా రోజూ ఒకటి సృష్టించడం..తప్పుడు ఫిర్యాదులు చేయడం. వాళ్ళకు దింపుడు కల్లం ఆశ కూడా పోయినట్లు ఉంది.పోతూ పోతూ ఇంత బురద చల్లడం అది మేం కడుక్కోవాలని చూడటం చేస్తున్నారు. మీడియాలో జగన్ కి, మా పార్టీకి స్పేస్ దొరకకుండా చేయాలని ఇదంతా చేస్తున్నట్లుగా ఉందన్నారు. దయచేసి ప్రజలు వీరి ఆగడాలను గమనించాలని కోరారు. బిజేపి అడిగితేనే మేం పొత్తుకున్నామని చంద్రబాబు చెబుతున్నారంటూ అనే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాడిన విషయం లోకానికంతటికి తెలుసున్నారు. బహుశా అమిత్ షాకు,నరేంద్రమోదిలకు తెలుగురాదని చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తుందన్నారు. ఇక్కడ బిజేపి స్టేట్ లీడర్ షిప్ లో ఉండేది మన ఏజంట్లే కదా వాళ్ళు ఎటూ స్పందించరని చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడని అనిపిస్తుందన్నారు. కేసులు నుంచి బయటపడాలని బిజేపితో పొత్తుకు ప్రయత్నించడం,పొత్తుకు రాయబారిగా పవన్ కల్యాణ్ వ్యవహరించడం ప్రజలకు తెలుసన్నారు. తాను ఏదంటే అది మీడియాలో వస్తుంది కాబట్టి పదే పదే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. నరసాపురం ఒక్కటి కూడా రఘురామరాజుకు ఇచ్చి ఉంటే బిజేపికి ఇచ్చిన ఎంపీ స్దానాలన్నీ చంద్రబాబే డిసైడ్ చేసినవే వచ్చినట్లు ఉండేది. అది ఎందుకో ఇవ్వలేదు. అలా జరిగిఉంటే ఎన్నికలలో రిజల్ట్స్ తేలిసేది. మిగిలినవాటిలో కూడా చూస్తే బిజేపిలో ఉన్న టిడిపి ఏజంట్లతో నింపించారని మీడియాలో వస్తున్న కధనాలు చూస్తే అర్దమయిపోతుందన్నారు. మూడు కోట్లు ఇస్తే స్దానం మారుస్తామని ఆడియో కూడా బయటకు వచ్చిందన్నారు. సీరియస్ గా ప్రజలకు సేవచేయాలనుకుంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. నాయకుడు ఎలాంటి వాడు అనేది ప్రజలకు మనం అర్ధం కావాలి.పార్టీ ఎలాంటిది అనేది కూడా తెలియాలి. సింగిల్ పార్టీగా ప్రజలముందుకు వెళ్లినప్పుడే బాగుంటుంది. కలగూరగంపలాగా ఎన్నికలకు వెళ్లి అతుకులు వేసుకుని ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుందన్నారు. ఇటు చూస్తే ప్రస్తుతం జగన్ తాము ప్రజలకు ఏమి చేశారో చెప్పారు. నాయకులు కూడా కిందకు వెళ్లి చెప్పారు. టీమ్ రెడీగా ఉంది. ప్రజలు కూడా మంచి అజెండాతో ఉన్న వైయస్సార్ సిపిని ఎంపిక చేసుకున్నారు. అటు చూస్తే వాళ్లు డెస్పరేట్ మూడ్ లో ఉన్నారు. ఆస్దులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికి చంద్రబాబు లాంటి వ్యక్తి నాటకానికి జాతీయ పార్టీతో సహా మిగిలిన వారంతా బలయ్యారని అర్దమవుతుందన్నారు. అఖరు నిముషంలో మందలాగా వచ్చిపడిన వారిని రిజెక్ట్ చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అని అన్నారు. రాయలసీమకు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేసింది ఏమీ లేదన్నారు. రాయలసీమ అభివృధ్ది జగన్ వల్ల జరిగిందనేది ప్రజలకు క్లారిటీ ఉందన్నారు. కుప్పంకు నీరు రావడానికి కారణం ఎవరో కూడా ప్రజలకు తెలుసున్నారు. చంద్రబాబు నాలుగువేల రూపాయల పెన్సన్ ఇస్తామని, బిసిలకు 50 సంవత్సరాలకే పెన్సన్ ఇస్తామని చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చంద్రబాబు కేజి బంగారం ఇస్తారని, బెంజి కారు ఇస్తానని చెబుతుంటాడని జగన్ కూడా చెబుతుంటారు. అవే కాదు. ఆయన ఏమీ తెచ్చి ఇస్తామని చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. కరెన్సీ నకిలీ అని తేలిన తర్వాత దానికి ఏమీ విలువ ఉండదు. దానిపై ఆర్ బి ఐ ముద్ర ఉన్నా కూడా దొంగనోటు తెలిసిన తర్వాత దానిని ఎవరి వద్దా ఉంచుకోరు. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్ ఇస్తున్న సంక్షేమ పధకాలు ఆయన ఆపేస్తాడని ప్రజలకు తెలిసిపోయింది. నాలుగువేలు పెన్సన్ అనేది దేవుడెరుగు. ఇప్పుడు 66 లక్షల మందికి పైగా పెన్సన్ జగన్ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలు వచ్చేనాటికి 39 లక్షలమందికి ఇచ్చేవాడు. పెన్సన్ నాలుగువేల రూపాయిలు ఇస్తే కనుక లబ్దిదారుల సంఖ్య 10 లక్షలమందికి దించుతాడని అన్నారు. గతంలోలా టిడిపి అరాచక పాలన తెస్తాడు. జన్మభూమి కమిటీలను తీసుకువస్తాడు. అసలు చంద్రబాబుకే తాను చెబుతున్నవాటిపై నమ్మకం లేదేమో అని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన పచ్చమీడియాలో కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రజలు వాటిని నమ్మరని తెలుసన్నారు. నిజంగా ధైర్యం ఉంటే తాను ప్రజలకు ఏమి చేస్తాడో అది చెప్పవచ్చుకదా అది కుదరకే కంటైనర్. ప్రచారసామాగ్రి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2014-19 మధ్య టిడిపి అరాచక పాలన చూశారు కాబట్టే దాని గురించి వాళ్లు మాట్లాడటం లేదన్నారు. జగన్ పాలనలో బ్రహ్మాండమైన అభివృధ్ది జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టే వైయస్సార్ సిపిని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సిధ్దమయ్యారన్నారు.