ప్రతి వ్యాపారికి అండగా ఉంటాం
ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటాం
వైసీపీ పశ్చిన నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్
గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ మార్కెట్ వద్ద విస్తృత ప్రచారం
విజయవాడ బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలోని పేదలు, వ్యాపారులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు. ఇలా సకలజనుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఐదేళ్లు పాలన సాగించారని తెలిపారు. తన సంక్షేమ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆసిఫ్ మంగళవారం గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్ సే కమర్షియల్ మార్కెట్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వ్యాపారి, ముఠా కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.