వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు
దేశంలోని అన్ని వ్యవస్ధలను శాసించేలా చేయడం చంద్రబాబుకు మొదటినుంచి అలవాటు
చేసిన తప్పులనుంచి తప్పించుకోవడానికి వ్యవస్దలను మేనేజ్ చేసేవారు
చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది వ్యవస్దల మేనేజ్ మెంట్.అవినీతి
అవినీతి,దోపిడీ విధానాలను ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబులో ఎలాంటి మార్పులేదు
తన రాజకీయజీవితంలో అవినీతిని సమాంతరంగా బ్యాలెన్స్ చేశారు.అవినీతిని వ్యవస్దీకృతం చేశారు
మీడియాను అడ్డుపెట్టుకుని అసత్యాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట
40 ఏళ్ల అనుభవం చూస్తే చంద్రబాబు చేసిన అవినీతే ఆయనకు మిగిలింది
ఇక్కడ అవినీతిని చంద్రబాబు అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లాడు
నరేంద్రమోదిని అన్ని తిట్లు తిట్టి తిరిగి ఆయనతోనే పొత్తు చంద్రబాబుకే సాధ్యం
చంద్రబాబు “మహాదోపిడీ”, పుస్తకావిష్కరణ సభలో వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ పి.విజయబాబు రచించిన చంద్రబాబు *మహాదోపిడీ” పుస్తకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయబాబుతోపాటు శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి, శాసనసభ్యులు మల్లాీది విష్ణు, మహిళా కమీషన్ మాజి ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,కృష్ణంరాజు,ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్లు కొమ్మూరి కనకారావు,అమ్మాజి,వైయస్సార్ సిపి నేతలు చల్లా మధుసూధన్ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,నారాయణమూర్తి పాల్గొన్నారు. చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే దోపిడీ,అవినీతి అని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ రెడ్డి అన్నారు. రాష్ర్టంలో అవినీతిని అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రాష్ర్టాన్ని నమిలి మింగడానికి తిరిగి పొత్తులతో చంద్రబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు రచించిన చంద్రబాబు” మహాదోపిడీ “, పుస్తకాన్ని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత పి.విజయబాబుతోపాటు శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి, శాసనసభ్యులు మల్లాీది విష్ణు, మహిళా కమీషన్ మాజి ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు,ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్లు కొమ్మూరి కనకారావు,అమ్మాజి,వైయస్సార్ సిపి నేతలు చల్లా మధుసూధన్ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి విషయంలో విశ్వరూపం ప్రదర్శించారు. అవినీతిని వ్యవస్ధీకృతం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అవినీతి విషయంలో అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు అనగానే గుర్తుకువచ్చేది అవినీతి. వ్యవస్దలను మేనేజ్ చేసి కరప్ట్ చేయడంలో దిట్ట అని అన్నారు. వ్యవస్దలను అవినీతి ద్వారా మేనేజ్ చేసి శాసించగల మాఫియానేతగా చంద్రబాబు తననుతాను తన అనుకూల మీడియా ద్వారా చిత్రీకరించుకున్నారు. ఇది అద్బుతమైన అంతర్జాతీయస్దాయి సినిమాకధగా బాగుంటుంది కాని,మన కర్మకాలి అది మన రాష్ర్టంలోనే నిజమైంది అని అన్నారు. అంతర్జాతీయస్దాయిలో అవినీతి , దేశంలో అన్ని వ్యవస్థలను శాసించడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం. చంద్ర బాబు అంటే గుర్తొచ్చేది వ్యవస్థలను మేనేజ్ చేయడమే. మీడియాను అడ్డం పట్టుకునే ఉవ్వెత్తున అసత్య ప్రచారాలు చేయడంలో దిట్ట అన్నారుతద్వారా తాను ఒక బలమైన వ్యక్తిగా అందరి ముందు కనిపించి ఆరోజుకు అవసరమైన పొత్తులతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించడం చేస్తుంటారన్నారు. అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం చంద్ర బాబుకు అలవాటే. ఐదు సంవత్సరాలు అవినీాతిని వ్యవస్దీకరించి పార్టీని మాఫియా ముఠాలాగ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడని తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు,పచ్చకార్యకర్తలు మొత్తం అంతా రాజకీయపార్టీగా చలామణి అవుతున్నా నలభై ఏళ్ల అనుభవం తరువాత చంద్ర బాబు చేసిన అవినీతే ఆయనకు మిగిలింది. 2014-19 మధ్య జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి రాజకీయ జీవితంలో సమాంతరంగా అవినీతిని బ్యాలెన్స్ చేశాడన్నారు. కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర నిధుల వరకు ఎదో ఒక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు.కిందకు వెళ్లే రూపాయిలో ముప్పావులా ఎలా కాజేయచ్చో అది చెట్టు-నీరు లేదా పోలవరం అమరావతి కావచ్చు.అని అన్నారు.నిజానికి అమరావతి కూడా ఒక పెద్ద స్కాం అని తెలియచేశారు. ప్రజలు చీ కొట్టి తరిమివేసిన తన వైఖరిని చంద్రబాబు ఇప్పటికీ మార్చుకోలేదు. ఇదే సమయంలో చూస్తే జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఒక బలమైన యువనేత రాష్ర్ట పగ్గాలు చేపట్టారన్నారు.చంద్రబాబును ప్రజలు బలమైన దెబ్బకొట్టి చెత్తబుట్టలో పడేశారన్నారు. అయినా సరే ఈరోజు మళ్లీ సర్వశక్తులు కూడగట్టుకుని తన దోపిడీ ద్వారా సంపాదించిన అంతర్జాతీయస్దాయిలో నిధులను సమీకరించుకుని డూ ఆర్ డై అంటూ తలపడతున్నారన్నారు.రాష్ట్రాన్ని నమిలి మింగడానికి మళ్ళీ పోత్తులతో చంద్రబాబు వస్తున్నాడు. ఈరోజు జరిగే యుధ్దంలో ఇటువైపు జగన్ సృష్టించే క్రమంలో ఉన్న అద్బుతమైన కలల రాజ్యం…సుస్దిరమైన,శాశ్వతమైన,ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించేదిశగా అడుగులు వేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు తిరిగి తన అరాచకమైన,దోపిడీ,అవినీతి చీకటి పాలనలోకి రాష్ర్టాన్ని తీసుకువెళ్లే ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, జనసేనతో పాటు నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు జత కట్టారు. అవుట్ సోర్సింగ్ లాగ అన్ని పార్టీల మద్దతు కూడా గట్టుకొని పొత్తులతో వస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎలా అయ్యారు. వైఎస్ షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడా నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎవరు ఎలా వచ్చినా ఎంత మంది వచ్చినా ఎన్నికల యుద్దానికి సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అట్టడుగున ఉన్న అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. దేశం మొత్తం చూసేలా ఎన్నికల్లో అభ్యర్థులను వైయస్సార్ సిపి నిలిపింది. ఎస్సీ , ఎస్టీ, బిసి,మైనార్టీలకు పోటీ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు. అన్ని శక్తులు ఏకమై వైయస్సార్ సిపి మళ్ళీ అధికారంలోకి రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలని ఎన్ని కుట్రలు చెయ్యాలో అన్ని చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి చేయాల్సిన అవినీతి అంతా మళ్ళీ చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. అన్ని తిట్లు తిట్టి మళ్ళీ మోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నా కూడా అత్యంత నీచంగా ఆమెను చంద్రబాబు చిత్రీకరించారు. అధికారం కోసం ఆమె క్యారెక్టర్ ను కూడా రోడ్డుకు లాగారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకయిన దిగజారతాడని అన్నారు. రాజకీయం అంటే దోపిడీ అనుకునే చంద్రబాబు ఉన్నారు.అధికారం కోసం గతంలో తను ఓడిపోయినా ఆదరించిన మామ ఎన్టీఆర్ ను, తోడల్లుడు దగ్గుబాటిని, ఎన్టీఆర్ కుటుంబాన్ని, లక్ష్మీపార్వతిని, ఇప్పుడైతే పురందేశ్వరిని ఇలా ఎవరిని ఎక్కడా ఎలా బలివ్వాలో ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు.ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు.చివరకు గతంలో నరేంద్రమోదిని తిట్టిన తిట్ట్లు తిట్టకుండాతిట్టారు.తిరిగి నేడు ఆయన చెంతన చేరారు. ఒక బలమైన కులం ఓట్ల కోసం అంటూ పవన్ కల్యాణ్ ను తనకు రాబోయే అధికారం కోసం చెంతచేర్చుకున్నాారు. విజయబాబు పైపైన ఈ పుస్తకం రాయడం కోసం చంద్రబాబు పాలనలోని చరిత్ర తడిమితే నాలుగులక్ష కోట్లు ఉన్నాయంటున్నారు.నిజానికి ఆరులక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంటాయన్నారు. చంద్రబాబు అవినీతిని కాగ్ నివేదికలతో బయటకు తీస్తే 10 యేళ్లు అయిన సరిపోదన్నారు. చంద్రబాబు హెరిటేజ్ కోసం సహకారవ్యవస్దను నాశనం చేశారన్నారు.చంద్రబాబు ప్రజలలో తిరిగి భ్రమలు కల్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.2014-19 మధ్య చంద్రబాబు అరాచక పాలన 2019-24 మధ్య జగన్ గారు సుపరిపాలన,సంక్షేమపాలన గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసిన విజయబాబును అభినందించారు.ఇలాంటివి ఇంకా రావాలి.వాస్తవాలు ప్రజలలోకి వెళ్లాలి.వారు ఆలోచించి నిర్ణయం తీసుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.జగన్ గారు డిబిటి గురించి కొందరు విమర్సలు చేస్తుంటారు.కాని ఎటువంటి అవినీతి లేకుండా నిజమైన లబ్దిదారుకు పధకం అందేలా విజయవంతంగా చేయగలిగారన్నారు. జగన్ , అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతలు, జాతిపిత మహాత్మాగాంధిలాంటి మహనీయులు కోరుకున్న విధంగా పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎస్సీ,ఎస్టి,బిసి,మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యులను సైతం ఎన్నికలలో అభ్యర్దులుగా నిలబెట్టారు.దేశం అంతా వైయస్సార్ సిపి అభ్యర్దులవైపు చూసేలా చేశారన్నారు.అందుకే నేడు ప్రజలంతా జగన్ కి అండగా నిలబడ్డారన్నారు. సాంప్రదాయపాలనకు భిన్నంగా సంస్కరణలు తెచ్చి పేదప్రజలు,బడుగు బలహీనవర్గాలకు మేలు చేసే పాలన సాగిస్తున్నారన్నారు. పుస్తక రచయిత పి.విజయబాబు మాట్లాడుతూ చంద్రబాబు అంతులేని అవినీతికి గేేట్లు ఎత్తేశారన్నారు.చంద్రబాబు న్యాయస్దానాల్లో ఈ అవినీతిపనులు నిరూపితం కాకుండా జాగ్రత్త వహించడంలో ఆరితేరారన్నారు.ఇప్పటికే పలు కేసులలో స్టే తెచ్చుకున్నారన్నారు. తాజా కేసులలో కూడా బెయిల్ తెచ్చుకున్నారని తెలియచేసారు. నిజానికి చూస్తే ప్రజాకోర్టు చంద్రబాబును ఐదేళ్లలోనే శిక్షించిందన్నారు. ప్రజలను మరోసారి వంచించడానికి అవకాశవాద అవతారాలతో వస్తున్నప్పుడు ఆ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అనిపించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు. సమాజాన్ని దోపిడీ చేసేందుకు ఫ్యూడలిస్ట్ రాజకీయం…నయా జర్నలిజం ఏకం అయ్యాయన్నారు.మానవ రక్తం రుచిమరిగిన పులుల్లా పేదలకు దక్కవలసిన ధనాన్ని తినేయడానికి అలవాటు పడిన శక్తులు అన్నీ ఏకమై తమ దోపిడీకి అడ్డునిలిచిన జన నేత జగన్ పై ముప్పేటదాడి చేస్తున్నవేళ ఈ పోరాటంలో అక్షరాయుధాలుసైతం అవసరం అనిపించిందన్నారు. దానిలో భాగంగానే “మహాదోపిడీ” పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు. ఈ పుస్తకంలో జయలలిత, లాలూప్రసాద్ యాదవ్, మధుకోడా, ఓంప్రకాష్ చౌతాలా వాళ్ల స్కామ్ ల గురించి రేఖా మాత్రంగా స్మృశించాను. నిజానికి చంద్రబాబుతో పోలిస్తే వాళ్లవి చాలా చిన్న మొత్తాలు.కాని వాళ్లుకూడా జైలులో ఉన్నారు.చంద్రబాబు పాపం పండింది.ఏదోఒకరోజు భారీ మూల్యం చెల్లించకతప్పదు.
అధికారంలోకి రాకుండా వందలు,వేలకోట్లు సంపాదించే టెక్నిక్ కనిపెట్టిన పవనిజంపై కూడా పుస్తకం రాస్తా
ఈ దేశంలోనే పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి ద్వారా పెద్దమొత్తంలో కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అయితే దేశరాజకీయాలలోనే రాజ్యాధికారాన్ని చవిచూడకుండా రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎలా సంపాదించవచ్చనే టెక్నిక్ కనిపెట్టినవ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.అధికారంలోకి రాలేదు,గెలవలేదు.అయినా రాజకీయాలను అడ్డుపెట్టుకుని వందలు వేల కోట్లు ఎలా కొట్టేయవచ్చనేదానికి తెరలేపాడు. అలాంటి పవనిజం మీద కూడా పుస్తకం రాస్తానని ప్రకటించారు.