డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదని వంగా గీత అన్నారు.