అమరావతి నుంచి ప్రధాన ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకీ పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రీ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కాగా మద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేశారు. లక్ష్మీనారాయణ శాస్త్రి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా (వైఎస్సార్సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్) పాల్గొన్నారు. అలాగే సీఎం జగన్ సమక్షంలో నెల్లూరుకు చెందిన మలిరెడ్డి కోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువాను కప్పి మలిరెడ్డిని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. నెల్లూరు రూరల్, అర్బన్‌తో పాటు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కోటారెడ్డికి కీలక పట్టున్ననేతగా గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.