వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా కార్యదర్శి గంజినబోయిన శిరీష
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆర్థిక అభివృద్ధికి, మహిళల ఆర్థిక సుస్థిరతకు కృషి చేస్తున్న వ్యక్తి మహిళా పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా కార్యదర్శి గంజినబోయిన శిరీష అన్నారు. గడిచిన 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా 2,79,786 కోట్ల ను మహిళలకు అందజేసిన ఘనత వైయస్ జగన్ కు దక్కుతుందన్నారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. మహిళలు తమ కుటుంబాలను పటిష్టపరచుకొని తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళలకు ఇంతటి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్రం లేదన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇది జరుగుతోందని, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సునా వడ్డీ, కాపు నేస్తం, పేదలందరికీ ఇల్లు, ఆరోగ్యశ్రీ వంటి ముఖ్యమైన పథకాల వాళ్ళ మహిళల జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఈ పథకాల ద్వారా లబ్ధిని ఉపయోగించుకుని చిరు వ్యాపారాలు ప్రారంభించుకోవడం, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడం, పొదుపు ద్వారా ఆదాయ మార్గాలను కూడా పెంపొందించుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న ఆర్థిక సహకారం వల్ల మహిళలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళా లోకం మొత్తం వైయస్ జగన్ కు మద్దతుగా నిలబడబోతున్నారని చెప్పారు. రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చేసుకోవడానికి మహిళ లోకం సిద్ధంగా ఉందని తెలిపారు.