రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
విజయవాడ, ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు చేపట్టి లక్షలాది రూపాయల విలువ చేసే స్థిరాస్తి పేదల సొంతమయ్యేలా చేసి పేదల సొంతింటి కల సాకారమయ్యేలా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం పెనమలూరు నియోజక వర్గం కంకిపాడు మండలం వణుకుడ్రు గ్రామంలో జగనన్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ పంపిణీ చేసిన ఇళ్ళను హౌసింగ్ ఉన్నత శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 200 సంవత్సరాల క్రితం ఏర్పడిన వణుకూరు గ్రామంకు దీటుగా జగనన్న కాలనీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక కాలనీవాసులు వరలక్ష్మి కోటేశ్వరావు మాట్లాడుతూ,లేఔట్ -3 లో రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని అలాగే తాగునీటి వసతి వీధి దీపాల సమస్య తీర్చాలని మంత్రిని అభ్యర్థించారు తక్షణమే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారిని పిలిచి ఆ వీధిలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పరిచి విద్యుత్ దీపాలను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.
తొలుత మంత్రి జోగి రమేష్ ఉయ్యూరు మండలం, ముదునూరు గ్రామంలో ముదునూరు నుంచి సాయిపురం గ్రామం వరకు 2 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అర్ అండ్ బీ బిటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బోళ్ళపాడు గ్రామంలో 15 లక్షల రూపాయలు వ్యయంతో బోళ్ళపాడు రామచంద్రాపురం డొంక రోడ్డు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత కలవపాములు గ్రామంలో 43 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కాటూరు గ్రామంలో 43 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కడవకొల్లు గ్రామంలో 43 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కంకిపాడు మండలం, కంకిపాడు గ్రామంలో 14 లక్షలు వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడి భవన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పునాదిపాడు గ్రామంలో 23 లక్షల 94 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని , 20 లక్షల 80 వేల రూపాయల వ్యయంతో హెల్త్ సెంటర్ నూతనంగా నిర్మించిన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉప్పులూరు గ్రామం నుంచి మద్దూరు వరకు వయా ఈడుపుగల్లు, గోసాల, వణుకూరు మీదగా పది కిలోమీటర్ల మేర 19 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన బి టి రహదారికి ఈడుపుగల్లు సెంటర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల లేఔట్ ను హౌసింగ్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పెనమలూరు మండలం పెనమలూరు పంచాయతీలోని 1, 2 , 3 నూతన సచివాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో,గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు జడ్పిటిసి సభ్యుడు బాకీ కోటేశ్వరరావు బాబు టిడ్కో డైరెక్టర్ రాఘవరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జివి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ పి. వెంకటేశ్వరరా వు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.