“0” నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా
కడప : పోలియో రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నకాష్ వీధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో పోలియో చుక్కల ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశ నిర్మాణం కోసం గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు “0” నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తూ పోలియో రహిత నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే కడప నగరంలో కూడా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసుకుంటున్నామని 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ తమకు దగ్గరలోని పోలియో కేంద్రానికి వెళ్లి పోలియో చుక్కలను వేయించుకో వలసిందిగా కోరారు. ఈ పోలియో చుక్కల కార్యక్రమం నిరంతరం కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా భారత దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా పోలియో కేసులు నమోదు కాలేదని, ఈ పోలియో కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన దేశానికి సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ గాని ఇతర దేశాల్లో పోలియో కేసులు నమోదు కావడం వల్ల ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే ఆలోచనలో భాగంగానే భారత ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగించడం జరుగుతోందన్నారు. మన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ “5” సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించుకో వలసిందిగా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఈ వైరస్ నివారణలో భాగంగా ఇతర దేశాల నుండి మన దేశానికి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి పై కూడా ఉందని అన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు. తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తదనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తోపాటు డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ నాగరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.