పోలియో విముక్త సమాజం లక్ష్యంగా 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించండి
జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
రేణిగుంట, తిరుపతి : పోలియో విముక్త సమాజం లక్ష్యంగా 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కే నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంయుక్తంగా పేర్కొన్నారు. ఆదివారం రేణిగుంట మండలం వెదుల్లచెరువు ఎస్టీ కాలనీ నందు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్ అధికారిణి రమాదేవి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితరులతో కలిసి పాల్గొని 0-5 సం. ల పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలియో నివారణకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి 0-5 సం. ల పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. దేశంలోనే రాష్ట్ర పభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసిందని పేద వాడికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు 0-5 సం. ల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని గురించి విస్తృతంగా అవగాహన కల్పించి సచివాలయ కేంద్రాల్లో పీహెచ్సీ అంగన్వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో ఉచితంగా పల్స్ పోలియో చుక్కలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో సుమారు 2,53,282 మంది 0-5 సం. పిల్లలకు పోలియో చుక్కలు వేయించాల్సి ఉందని, పోలియో చుక్కల వ్యాక్సిన్ సుమారు 3.5 లక్షల డోసులు అందుబాటులో ఉందని ఈ రోజు 1824 పోలియో బూత్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రోజు పోలియో చుక్కలు వేసుకోకుండా ఏదైనా కారణంతో మిగిలిపోయిన పిల్లలకు 4,5 తేదీలలో ఇంటింటికి వెళ్లి జల్లెడ పట్టి పోలియో చుక్కలు వేయాల్సి ఉంటుంది అని అన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విధిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో రహిత సమాజ స్థాపనే లక్ష్యమనీ అన్నారు. తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలకు వచ్చే సందర్శకులకు, ప్రయాణీకులకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి ట్రాన్సిట్ ప్రాంతాల్లో కూడా పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, పట్టణ మురికి వాడలు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు వంటి ప్రాంతాల్లో కూడా 83 మొబైల్ టీమ్ ల ద్వారా వల్నరబుల్ గ్రూప్ పిల్లలను కవర్ చేయడం జరుగుతుందనన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని వర్గాల వారు అందరూ కలిసి సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జిల్లాకు కేటాయించబడిన రాష్ట్ర నోడల్ అధికారిణి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీహరి, జిల్లా టిబి నియంత్రణాధికారిని అరుణ సులోచన దేవి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. శ్రీనివాస రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డిఎల్డిఓ ఆదిశేషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.