విజయవాడ : విజయవాడ నగరంలో 2016 కృష్ణా పుష్కరాల సమయం లో తొలగించిన ఆలయాలను, పునః నిర్మాణం చేసిన సందర్బంగా ఇంద్ర కీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గురువారం ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కలశ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమములలో వేద పండితుల మంత్రోచ్చారణలు, అర్చక స్వాముల ప్రత్యేక పూజల మధ్య పాల్గొన్నారు. ఏక ముహూర్తం లో అన్ని చోట్ల జరిగిన ఈ క్రతువుల్లో మంత్రి, దేవదాయ శాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి కె. ఎస్. రామరావు స్వయంగా సీతమ్మ వారి పాదాలు ప్రాంతం లో గల శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, రధం సెంటర్ లో గల బొడ్డు బొమ్మ, శ్రీ కనక దుర్గ అమ్మవారి పాత మెట్లు వద్ద నిర్మించిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి ఆలయం ( తొలి మెట్టు ) వద్ద పూజాదికములలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మ కర్తలు బుద్దా రాంబాబు, బచ్చు మాధవీ కృష్ణ, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, దేవాదాయ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.