నరసరావుపేట : నరసరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నలుమూలల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక లాంటిది సోషల్ మీడియా ప్రభావం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని, మీ అందరి కృషితో పల్నాడు జిల్లాలో 7 కి 7 స్థానాలు, పార్లమెంటు స్థానం కూడా గెలిపించుకోవాలన్నారు.