కాంట్రాక్టు పద్ధతిలో 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకం
అమరావతి : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో నిరంతర నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పటికప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ కింద 189 పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు,
అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు (అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు)లలో ఖాళీగా వున్న 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సుల పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వనిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్…