వర్చువల్ గా శంకుస్థాపన పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
పుట్టపర్తి : నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రి నందు50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ 23.25 కోట్ల తో నిర్మించనున్న బ్లాక్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆదివారం ప్రధాని గుజరాత్ రాష్ట్రంలోని రాజకోట్ లో జరిగిన సమావేశం నుండి దేశ వ్యాప్తంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , శంకుస్థాపనలు చేయగా రాష్ట్రం లో 9 క్రిటికల్ కేర్ బ్లాక్ లను వర్చుల్ గా శంకుస్థాపన లు చేశారు. హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు23 కోట్ల నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి సందేశం ప్రేక్షకులు వీక్షించారు. అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్, పుర ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలోని హిందూపురం జిల్లా ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం మొత్తం రూ.22.25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ భవన నిర్మాణం నాణ్యమైన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. ఈ క్రిటికల్ కేర్ అందుబాటులోకి వస్తే వెంటిలేటర్ పై వైద్యం అందించవచ్చు . బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వారు, రోడ్డు ప్రమాదంలో బారిన పడిన వారికి మెరిగిన వైద్యం అందించవచ్చని తెలిపారు. త్వరలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పనులు పూర్తిచేసి జిల్లా ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్ భరత్, హిందూపురం మున్సిపల్ కమిషనర్, బిజెపి నాయకులు, డిఎంహెచ్వో ఎస్ వి కృష్ణారెడ్డి, డి సి హెచ్ ఓ జితేంద్ర నాయక్, ఆసుపత్రి సూపర్డెంట్ రోహిత్ కుమార్, ఆర్ ఎం ఓ రుక్మనమ్మ, నర్సింగ్ సూపర్డెంట్ ధనలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు,