నెల్లూరు : పల్నాడు జిల్లా మేదరమెట్లలో మార్చి నెల మూడో తేదీ జరగనున్న నాల్గవ సిద్ధం సభ సన్నాహ ఏర్పాటలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, పరిశీలకులు, ముఖ్య నాయకులతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వీ. విజయ సాయిరెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. మేదరమెట్లలో జరగనున్న నాల్గవ సిద్ధం సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాల పైన జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమిలి, ఏలూరు, రాప్తాడులలో జరిగిన మూడు సిద్ధం సభలకు భిన్నంగా మేదరమెట్ల సిద్ధం సభను నిర్వహించేందుకు అనుచరులు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగానే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మంత్రి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు, ముఖ్య నాయకులతో, చర్చించామన్నారు. వచ్చే వారంలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు. అదేవిధంగా జిల్లా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని రెండు మూడు రోజుల్లో నియామకం చేయడం జరుగుతుందని ఎంపీ విజయసారెడ్డి తెలిపారు. రాజ్యసభకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలో ఎవరు కూడా దూషించలేదని, ఆయన పైన ఎటువంటి ఆరోపణ కూడా చేయలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వివిధ కథనాలను ఆయన కొట్టి పారేశారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, అన్న వెంకట రాంబాబు, కేపీ.నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరుగ మురళీ, సమన్వకర్తలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మహ్మద్ ఖలీల్ అహ్మద్, దద్ధాల నారాయణ యాదవ్, తాటిపర్తి చంద్ర శేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగా రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య, మన్నేమాల సుకుమార్ రెడ్డి, వీరి చలపతిరావు, మోయిళ్ల గౌరీ, మంగళ్లపూడి శ్రీకాంత్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు.