25న మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ
రాజ్‌కోట్ నుండి వర్చువల్‌గా అంకితం చేయనున్న ప్రధాని
ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
పాల్గొననున్న కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతి ప్రవీన్ పవర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
ఏర్పాట్లపై ఎయిమ్స్ పరిపాలనా భవన్లో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు
గుంటూరు : మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్ (ఎయిమ్స్) ను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి రాజ్‌కోట్ నుండి వర్చువల్‌గా ఈ నెల 25న అంకితం చేయనున్నందున వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు ఎయిమ్స్ పరిపాలనా భవన్లో ఏర్పాట్లను శనివారం సమీక్షించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరో గ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీన్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పాల్గొంటారు. ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సమీక్షా సమావేశంలో కృష్ణబాబు సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఎపిఎంఎస్ ఐడిసి ఎం.డి.మురళీధర్‌రెడ్డి, కమీషనర్ జె.నివాఎస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ట్రైనింగ్-నేకో) నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్ , సిఇఓ డాక్టర్ మధబానంద కర్, ఎన్హెచ్ఎం ఎస్పీయం డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్, కల్నల్ శశికాంత్, ఎయిమ్స్ డీన్ ఎకడమిక్స్ డాక్టర్ రాజశేఖర మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ థామస్, వైద్య ఆరోగ్య, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించిన కృష్ణబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు విలువ రూ.1618.23 కోట్లు కాగా, 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఎయిమ్స్ లో ఉంది.
రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధాని శంకుస్థాపన : ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధాని మోడీ ఈనెల 25న వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడప, ఎసిఎస్సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం, శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి జిల్లా), గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కర్నూలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, విజయనగరం లలో రూ.23.75 కోట్లు చొప్పున, జిల్లా ఆసుపత్రి, తెనాలి (గుంటూరు) లో రూ.44.50 కోట్లు, జిల్లా ఆసుపత్రి, హిందూపుర్ (శ్రీ సత్య సాయి జిల్లా)లో రూ.22.25 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మిస్తారు.
వైజాగ్ లో మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ : పెదవాల్తేరు (విశాఖపట్నం) లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్ లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను , రూ.2.07 కోట్ల విలువైన నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు. సమీక్షలోఎపిఎంఎస్ ఐడిసి ఎం.డి.మురళీధర్‌రెడ్డి, కమీషనర్ జె.నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందకర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలోని సభా వేదికను కృష్ణబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు.