గుంటూరు : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అయ్యన్నపాత్రుడు కుటుంబంపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు, రాజేష్ లను సిఐడి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇది బీసీలపై జరిగిన దాడి అని, జగన్ హింస విధానం పై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక చర్యల పై పోరాడటం ఘోరంగా,ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కుతున్నారని, జగన్ మార్క్ దురాగతాలు,దురన్యాయాలు ఫాసిష్టు పాలనకు నిదర్శనమని జగన్ పాలనా విధ్వంస పురాణం అంతులేనిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.