తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, అనుముల్లంక గ్రామం నందు
గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తో కలిసి పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని).ఈ సందర్బంగా కేశినేని నాని మాట్లాడుతూ పల్లెసీమలు దేశప్రగతికి పట్టుకొమ్మలు. అభివృద్ధి ఎవరిదో తేలుద్దాం అని చంద్రబాబు అంటున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు నాయుడు సిద్ధమా? అన్నారు. అమరావతిలో ఒక సచివాలయం కడితేనే అభివృద్ధి ఐతే – 2000 మంది జనాభాకి ఒక సచివాలయం కట్టిన జగన్ ది అభివృద్ధి కాదా?. ప్రతీ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ లను దాని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. మానవ అభివృద్ధి అభివృద్ధి కాదా! – నీ కుటుంబ అభివృద్ధి మాత్రమే అభివృద్దా?. ఒక్క అనుముల్లంక గ్రామానికి 12 కోట్లు, గంపలగూడెం మండలానికి సుమారు 500 కోట్లు ఇచ్చిన ఘనత మన ప్రియతమ జగన్ మోహన్ రెడ్డిది. రామోజీ రావు, ఏబీన్, టీవీ5 వాళ్ళకి నిజమైన అభివృద్ధి కనపడడం లేదు. వ్యక్తిత్వ వికాసం, మానవ మానసిక సంతోషం ద్వారా జరుగుతున్న అభివృద్ధి కనపడడం లేదా. ఆరోగ్యంలో,చదువుల్లో, గ్రామీణ వికాసంలో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా నిలిపిన గొప్ప నాయకుడు సీఎం జగన్. 125 సార్లు మన కోసం సీఎం గారు బటన్ నొక్కారు – రెండుసార్లు బటన్ నొక్కితే ఆయనే మళ్లీ సీఎం అయి మనకోసం 250 సార్లు బటన్ నొక్కుతారు. దీనికి మించి రెట్టింపు అభివృద్ధి తథ్యం. ఈ సందర్బంగా సచివాలయ,రైతు భరోసా,హెల్త్ క్లినిక్ స్థలదాతలు చిలుకూరి ముసలారెడ్డి ని సన్మానించిన ఎంపీ కేశినేని నాని. స్థల దాతలు గ్రామచరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగ నర్సిరెడ్డి , ఎంపీపీ గోగులముడి శ్రీలక్ష్మి, జడ్పిటిసి కోట శామ్యూల్, సర్పంచ్ అత్తనూరి దీప్తి, ఎంపీటీసీ గౌరసాని కమల, స్థల దాతలు చిలుకూరి ముసలా రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు, రైతు సంఘం అధ్యక్షులు చెన్నుపాటి శేషగిరిరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు చెరుకు నరసారెడ్డి, సీనియర్ నాయకులు గోగులముడి చెన్నకేశవరెడ్డి, ఎంపీడీవో నాగేశ్వరరావు, గౌరసాని శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అత్తనూరి పద్మా రెడ్డి, సీనియర్ నాయకులు గౌరసాని రంగారెడ్డి, డైరెక్టర్ పేమ్మసాని ఆంజనేయులు, వజ్రాల శ్రీనివాసరెడ్డి,వైస్ చైర్మన్ చిట్టిబొమ్మ వెంకటేశ్వర రావు, మందపాటి ఉమామహేష్ రెడ్డి, వంగల వైకుంఠం, మండల పార్టీ ఉపాధ్యక్షులు మాచినేని నాగ మల్లేశ్వరరావు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.