బీసి కమిషన్ సిఫారసులను ఆమోదించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
అసెంబ్లీ లోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శాలువతో సన్మానించి, పుష్పగుచ్చం అందచేసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, చైర్మన్ వకుళాభరణం
రాష్ట్రం లోని ప్రజలందరి వాస్తవ స్థితిగతులు, వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు “సామాజిక, ఆర్థిక కుల సర్వే” నిమిత్తం ప్రవేశ పెట్టిన, ప్రభుత్వ తీర్మానం ను శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల రాష్ట్ర బీసి కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు హర్షం ప్రకటించారు. రాష్ట్రం లోని బలహీన వర్గాలు, తమ జీవితాలలో సమున్నతంగా, ఎదిగే ‘లక్ష్యసాధన’ కు ఇది శుభారంభంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా బీసీలు దశాబ్దాలుగా ఇంటింటికి వెళ్లి, తమ లెక్కలు తీసి , జనాభా దామాషా మేరకు వాటా కల్పించాలని చేస్తున్న డిమాండ్, ఇన్నాళ్ళకు అది నేరవేరబోతున్నది. ఇది ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో చేపట్టబోయే ”కుల సర్వే” త్వరితగతిన పూర్తికావాలి, ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా బీసిల చిరకాల డిమాండ్లు అన్నీ క్రమంగా నెరవేరాలని డా. వకుళాభరణం ఆకాంక్షించారు. విద్యార్ధి దశ నుండి అనేక సామాజిక ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొన్న ఉద్యమ నాయకుడిగా, బీసీల హక్కులు ప్రయోజనాలకోసం కృషి చేసిన ప్రజా ప్రతినిధిగా, ప్రస్తుతం బీసి సంక్షేమ శాఖా మంత్రిగా శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ తీర్మానం ను ప్రవేశపెట్టడం, అసెంబ్లీ ఆమోదించడం శుభారంభం అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి, ఇంతటి మహత్తర కార్యానికి పూనుకోవడం గొప్ప విషయం అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం “సంక్షేమ ప్రజా ప్రభుత్వం” గా చరిత్ర పుటలకెక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి , బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
ఇలాంటి చారిత్రక ఘట్టం లో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గా , ప్రభుత్వానికి “కుల సర్వే” నిమిత్తం, సిఫారసు చేసే అవకాశం రావడం, ఆ సిఫారసులను, ప్రభుత్వం గౌరవించి, తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపచేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో గొప్ప అనుభూతి ని ఇస్తున్నదని డా. వకుళాభరణం అన్నారు.
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని కలిసి అభినందనలు : అసెంబ్లీ లో “ సామజిక, ఆర్థిక కుల సర్వే తీర్మానం” ఏకగ్రీవంగా ఆమోదింపబడిన, అనంతరం శాసనసభలోని చాంబర్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపారు. మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆధ్వ్యర్యంలో రాష్ట్ర బీసి కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, బీసి సంక్షేమ శాఖా ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమీషనర్ శ్రీమతి బాల మాయ దేవి తదితర అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనను పుష్ప గుచ్చం, శాలువలతో సన్మానించి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నంప్రభాకర్, వకుళాభరణం, బుర్రా వెంకటేశం తదితరులను ప్రత్యేకంగా అభినందిచారు.