యాదాద్రి పవర్ ప్లాంటు పనులపై డిప్యూటి సీఎం సమీక్ష
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1600 (2×800) మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి డా. బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనుల పురోగతిపై పూర్తి స్తాయిలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం స్టేజీ -1 లోని రెండు యూనిట్లు, స్టేజీ-2లో నిర్మాణం అవుతున్న మూడు యూనిట్ల పురోగతి పనుల గురించి ఆరా తీశారు. స్టేజీ -1 లో నిర్మాణం అవుతున్న రెండు యూనిట్లకు సంబంధించి ఏలాంటి ఆవంతరాలు తలెత్తకుండ క్షేత్ర స్థాయిలో ఉండి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బొగ్గు రవణాకు సంబంధించి రైల్వే పనులను కూడా సమీక్షించి తర్వితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు 75శాతం రైల్వే పనులు పూర్తయ్యాయని మిగత 25 శాతం పనులు పూర్తి కావడానికి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు జెన్కో అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గత మూడు సంవత్సరాలుగా జరిగిన పనుల పురోగతి గురించి జెన్కో అధికారులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత చేపట్టబోయే పనులను యుద్ద ప్రాతిపదికన నిర్ణిత కాలంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు రూపోందించాలని జెన్కో అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో ఈసమావేశానికి ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, టిఎస్ఎస్పిడిసిఎల్ సీ.ఎం.డి ముషారఫ్ అలీ ఫారుఖీ, డిప్యూటి సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, జెన్ కో డైరెక్టర్లు సచ్చిదానందం, ఆజయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.