విజయవాడ : రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా (అతవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబిసి చైర్మన్ గా గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన పరసా రంగనాథ్ ను నియమించారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ ) జాతీయ అధ్యక్షులు , కేంద్ర సామాజిక ,సాధికారిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అత్తవాలే సూచన మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు రంగనాథ్ కు జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు రాందాస్ అతే వాలే, జాతీయ కార్యదర్శి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలను బలోపేతం చేయాలని రాష్ట్ర జిల్లా నియోజకవర్గస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఓబీసీల సమస్యలపై వాటి పరిష్కార దిశగా శ్రమించాలని రంగనాథ్ కు సూచనలు చేశారు. రాష్ట్ర ఓబిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ మాట్లాడుతూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఓబీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బలోపేతం అయ్యేవిధంగా పనిచేస్తామని, ఓబీసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ ) ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి రామదాసు అతే వాలే, జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావుకి, తనను ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు రంగనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.