కేసీఆర్ ని టచ్ చేసి చూడండి మాటాష్ అవుతూరు
కట్టె కాలే వరకు పులిలా పోరాటం చేస్తూనే ఉంటా
5600 మెగావాట్ల విద్యుత్ ఏర్పాటు చేసిన కరెంటు ఎందుకు ఉండటం లేదు..?
రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడుతారా.. ఎంత ధైర్యం మీది..
అసెంబ్లీలో జనరేటర్ పెట్టారు..గట్లా ఉంది పాలన
రైతు బంధు ఏమాయే..?
పంట కు బోనస్ ఇవ్వరట…?
నల్గొండ గర్జన సభలో గులాబీ బాస్ కేసీఆర్
నల్గొండ; కృష్ణా నది జలాల సమస్య అనేది మన జీవన్మరణ సమస్య అని, కొత్త ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ను అప్పనంగా కేంద్రానికి అప్పగించి అన్యాయం చేశారని గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.. నల్గొండ లో జరిగిన బహిరంగ సభ లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు…
కృష్ణా నది మన హక్కు అనేది మన జీవన్మరణ సమస్య, అని, చావో రేవో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు…24 ఏళ్ల నుండి పక్షిలా తిరిగి చెప్పుతున్న, కృష్ణ కావొచ్చు, గోదావరి కావొచ్చు నీళ్లు లేకుంటే ఎంత కష్టమో చెప్పాను, నల్గొండ లో ప్లోరోసిస్ వ్యాధి తో జీవితాలు ఆగం అవుతే, ప్రధాని టేబుల్ మీద వ్యాధి సోకిన వ్యక్తి ని తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు..మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ ద్వారా సమస్య ను పరిష్కరించడం జరిగిందన్నారు..కొంత మంది సన్నాసులు తెలియక, ఎదో మాట్లాడుతున్నారు. మన కోసం మనం పోరాటం చేయకపోతే ఎవ్వడు రాడు, ఓట్ల కోసం మాత్రమే వొస్తారు..ఇది ఆశా మాషీ కాదు..రాజకీయ సభ కాదు, బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్, కేంద్ర జలసంఘం కు, నీళ్లు దోచుకోవడానికి చూస్తున్న. వారికి ఒక హెచ్చరిక లా ఈ సభ ను ఏర్పాటు చేశాం..
నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల సమస్య ఇది..9 ఏళ్లలో కరెంటు లేకుండా చేసిన, బత్తాయి తోటల నల్గొండ లో కోట్ల పంటలు పండేలా చేసినన్నారు..పాలకుడు ఏదైనా చేయాలి అంటే దమ్ము కావాలి, ప్రజలకు మేలు చేయడానికి తపన ఉండాలన్నారు.., ఆనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం, జల సాధన ఉద్యమం చేసినం, నేనే వ్రాసిన పక్కనే కృష్ణ ఉన్నా సుక్క నీళ్లు రాకాపాయే అని అన్నారు.. డిండి, బస్వపూర్, పాలమూరు ఎత్తిపోతల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..80 శాతం పనులు పూర్తి అయినాయి..మిగతా పనులు పూర్తి అయ్యేలా చూడాలి. కాంగ్రెస్ వాళ్లు వందల్లో కేసులు వేసినా, కేంద్రం తో కూడా పోరాటం చేసినం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేసినం…
మోదీ కి వందల ఉత్తరాలు వ్రాసినం
మోదీ ప్రభుత్వం కు వందల ఉత్తరాలు వ్రాసినం, ట్రిబ్యునల్ వేయమన్నాము, సుప్రీం కు కూడా పోయాము, అయినా చెయ్యలేరు, కేసు విత్ డ్రా చేసుకుంటే వేస్తామన్నారు..వంద ఉత్తరాలు వ్రాసినం, ఎంపీ లు రంజిత్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి లు పార్లమెంట్ లో కొట్లాడినారు..ఎట్టకేలకు మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు..ప్రభుత్వం ఏది ఉన్నా మనం కొట్లాడాలి.. ఏది చేయాలన్నా మొగోడు లా పని చేసాం, ఎం చేస్తాం బఱ్ఱె మీద కోపం వొచ్చి దున్న పోతును తెచ్చుకున్నారు..ఈ జిల్లామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పాత రాష్ట్రం బాగుంది అటా, .నీళ్ల మంత్రిగా అనుభవం ఉంది కాబట్టి హరీష్ రావు అసెంబ్లీలో గర్జించాడు.. మూడు రోజులు మాయ మాటలు చెప్పి చూశారు..కట్టే కాలే వరకు తెలంగాణ ను అన్యాయం జరిగితే పులి లాగా లేచి కొట్లాడుతా కానీ పిల్లి లా ఉండా.కాటి కి వెళ్లే వరకు పోరాటం చేస్తాన్నారు…. చలో నల్గొండ అనగానే అర్జెంట్ గా శాసనసభ లో తీర్మానం పెట్టారు..తెలివి తక్కువ తీర్మానం పెట్టారు కరెంటు గురుంచి అందులో లేనే లేదు..వీళ్లకు పదవులు కావాలి, అంతే కానీ ప్రజల అవసరం వీరికి లేదు..అవసరం ఉన్నప్పుడు పోరాటం చేద్దాం, కేంద్రం మీద, రాష్ట్రం మీద, జల వనరుల రక్షణ మీద సద్దులు కట్టు కొని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు…కొత్త ప్రభుత్వం కొత్తగా ఏమైనా పని చెయ్యాలి.. కానీ కేసీఆర్ ను తిడితే పెద్దోళ్ళు అవుతారా..మీరు టీవీల్లో చూస్తున్నారు.. పదవులు శాశ్వతం కాదు కానీ మన హక్కులు, మన పిల్లల బతుకులు శాశ్వతం కాబట్టి మనం ముందుకు సాగుదాం..ఈ సమయంలో మైకు ఇబ్బంది పెట్టడం తో…మైకుకు మళ్లేమి పుట్టింది…అట్లానే ఉండుమను ఏమి చెయ్యకుర్రి, రోగమా, బీమారా, దాన్ని ఉన్నది ఉన్నట్టే ఉండని, సదురకు, అనడంలో సభలో నవ్వులు విరిశాయి.
24 గంటల కరెంటు ఇచ్చినమని, నాడు పాములు, తేళ్లు కరువంగా పొలం కాడికి పోవాల్సిన పని లేదు..నేడు, నేను పోగానే కటుక ఆఫ్ చేసినట్లు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.., దద్దమ్మల, చేతగాని వాళ్ళ రాజ్యం ఉంటే గిట్లనే ఉంటాడా, గట్టిగా అడగాలి, దామరచర్ల లో 4000 మెగావాట్ల కరెంటు, రామగుండం లో 1600 మెగావాట్ల కరెంటు వొస్తుంది..ఎందుకు ఇవ్వడం లేదు..ప్రజలను ఇబ్బంది పెడితే మీ సంగతి చూస్తాం..నిలదీస్తామన్నారు…బీఆర్ఎస్ తరహాలో కరెంటు ఇవ్వాలి..అసెంబ్లీలో జనరేటర్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది….జగదీష్ రెడ్డి మాట్లాడితే 7 సార్లు పోతుంది కరెంటు.. వెంబడి పడుతాం, వేటాడుతాం.
రైతులకు కూడా చెప్పులు ఉంటాయి….!
రైతు బంధు కూడా ఇవ్వరా, ఇంత చేతగాని వాళ్ళు, రైతులను చెప్పుతో కొడతారా..ఎన్ని గుండెలురా, కళ్లు నెత్తికి ఎక్కాయా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి, రైతులు చెప్పులు బందోబస్తు ఉంటాలి. ఒక్కసారి కొడితే మూడు పండ్లు ఊడిపోతాయి. మీకు వీలు కాకుంటే కొద్దిగా ఇస్తాము అని చెప్పాలి…ప్రజలకు విజ్ఞప్తి చెయ్యాలి..
.కేసీఆర్ ను తిరగనియ్యరా, చంపుతారా, రా రండి..చంపి మీరు ఉంటారా,
సీతారామ, పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చెయ్యాలి, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చెయ్యాలి, నీళ్లు ఇవ్వాలి..మాకంటే బాగా చూడాలన్నారు..
మెడిగడ్డ కాదు బొందల గడ్డకు వెళ్ళండి
గోదావరి ఉప నది ప్రాణహిత నదిలో 5వేల క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయి..మీకు చేత నైతే నీటిని పంపిణీ చేసి సాగునీళ్లు అందించాలి..మా మీద ఎదో ..బురద రుద్దుతామని చూస్తున్నారు…త్వరలో మేము కూడా అక్కడికి వెళ్లి మీ చరిత్ర కూడా ఎండగడుతాం..ఎం పీకుతారు ఎం చేస్తారు.. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలన్నారు..కాళేశ్వరం నుండి మెడిగడ్డ వద్ద ప్రాజెక్టు కు..250 పిల్లర్లు ఉంటాయి, అక్కడి నుండి బ్యారేజ్ లు, టన్నాళ్లు, , 15 సబ్ స్టేషన్లు, పంప్ హౌస్ లు, ఎన్నో ఉంటాయి..ఎదో ఒక దగ్గర పొరపాటు జరిగితే సరి చెయ్యాలి, అంతే కానీ మెడిగడ్డ పోతాం, బొందల గడ్డ పోతాం అని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు..
ఆందోళన అవసరం లేదు మళ్లీ డబుల్ స్పీడ్ తో అధికారంలోకి వొస్తామన్నారు..KRMB గురుంచి తెలియక పోతే..నన్ను అడిగితే చెప్తాను కదా అడిగే సంస్కారం లేదు..అప్పజెప్పుడు ఆగం అవ్వుడు జరిగిందన్నారు.., అసెంబ్లీలో తీర్మానం చేయడం ఆగమాగం అవసరమా, అసెంబ్లీలో తీర్మానం చేయగానే సరిపోదు..పోరాటం సాగిస్తూనే ఉందాం..రాజకీయాల కోసం కాదు..మన హక్కుల కోసం, న్యాయమైన పోరాటం చేయకపోతే బొండిక పిసుకుతారు..చావు కాడికి పోయి తెలంగాణ తెచ్చినా, అందుకే నాకు ప్రేమ ఉంటుంది తెలంగాణ మీద ప్రేమ, మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలని చెప్పినా పెట్టలేదు, 25000 కోట్లు ఇవ్వలేదు. అందరూ బతుకాలని రైతుబంధు ఇచ్చాము..టింగ్ టింగ్ మని మ్రోగు, అసెంబ్లీలో కొట్లాట తప్పితే ఏముంది…
మళ్లీ మనమే వొస్తాము, అధికారంలోకి రావడానికి ఎన్ని అయినా చెబుతారు..కనీస మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట.. మేము కొనలేదా, డబ్బులు రాలేవా, మరి ఏమైంది..దొంగ మాటలతో తప్పించుకుంటే నిద్ర పోనియ్యం, కృష్ణ, గోదావరి జలాలలో సంపూర్ణ మైన వాటా వొచ్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు.. సీఎం అఖిల పక్షం తో ఢిల్లీ కి పోయి పోరాటం చెయ్యాలన్నారు.., 5 ఏళ్లు ఉండండి..మంచిగా పరిపాలన చేయండి..ప్రభుత్వం రాగానే krmb ని అప్పగించారు..కేంద్రం మిలట్రీ కి అప్పగించారు..నన్ను కూడా బెదిరించారు..రాష్ట్రపతి పాలన చేస్తామన్నారు..భయపడలేదన్నారు…మన ఎంపీ లు పోయి కేంద్ర మంత్రిని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని పోయింది..మీరు వొద్దు అంటున్నారు అని ముఖం మీదనే చెప్పారు..అసెంబ్లీ సమావేశాలు ముగించి, కేంద్రం మీదికి వెళ్లి పోరాటం చేయాలన్నారు.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమస్య ను 6 మాసాల్లో పూర్తి చెయ్యాలి.. లేని పక్షంలో లక్ష పిడికిళ్లు ఏకమై అలుపెరుగని పోరాటం సాగిస్తామన్నాడు.