నెల్లూరు : ప్రముఖ జర్నలిస్టు విద్యావేత్త , జగతీ మీడియా గ్రూప్ అధినేత డాక్టర్ జాలె వాసుదేవ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్., నెల్లూరు జిల్లా డీ సీ సీ అధ్యక్షులు చేవూరు దేవ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. స్వాతంత్ర్య సమర యోధురాలు,భారత గానకోకిల సరోజినీ నాయుడు జయంతి వేడుకల సంధర్భంగా మొదట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి చేవూరు దేవ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం మహిళల హక్కుల సాధన కోసం పనిచేసిన సరోజినీ నాయుడు త్యాగాలను నాయకులకు, కార్యకర్తలకు గుర్తు చేసి స్ఫూర్తినిచ్చారు. నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు. దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిపాలనలో ప్రజల శాంతిభద్రలకు భంగం కలిగించేలా మహిళలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అదుపు చేయకపోగా తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి భరోసాను అందిస్తున్న తన సొంత చెల్లెలైన వై.ఎస్.షర్మిలని కూడా తన సోషల్ మీడియాలో నాయకుల చేత అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేయించడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మాత్రమే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలతో పాటు మమేకమై ఒక నూతన ఒరవడిని సృష్టించారని అభినందించారు. అందుకు సంబంధించిన తాజా ఉదాహరణే ప్రముఖ జర్నలిస్టు, విద్యావేత్త, జగతి మీడియా గ్రూప్ అధినేత డాక్టర్.జాలే వాసుదేవ నాయుడు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారికంగా పార్టీలో చేరి మొట్టమొదటి చేరికను సంతరించుకున్న గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పలు సోషల్ కార్యక్రమాల ద్వారా అనేక మంది దళిత గిరిజన ప్రజలను సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ చైతన్యవంతులుగా చేయడం మాత్రమే కాకుండా నేష్ణలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవంతో పాటు మీడియా రంగంలో కూడా అత్యంత ప్రావీణ్యం కూడా కలిగి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వై.ఎస్.షర్మిల గత నెల నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ జాలె.వాసుదేవ నాయుడుని సాదరంగా పార్టీ కండువాను వేసి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావు, పీసీసీ అధికార ప్రతినిధి లేళ్ళపల్లి సురేష్ బాబు, నగర అధ్యక్షుడు షేక్.ఫయాజ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసులు రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు షేక్. అల్లావుద్దీన్, ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.సి.సెల్ అధ్యక్షుడు మధుబాబు, పఠాన్.మస్తాన్, మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్. ఫజులుద్దీన్, బిట్టా.కిషోర్ బాబు, సీతా సుబ్బారావు, చేను సుజాత, జలీల్, సిరివెల్ల. నరేష్, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.