ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్ధాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్న ముఖ్యమంత్రి
సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంకు చేరుకుని క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు, అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు, ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.