శక్తి పీఠం ప్రాంగణంలో ప్రత్యేక సామూహిక హోమాలు
శక్తి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు (కరుణ స్వామి)
విజయవాడ : విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జికి తూర్పు వైపు ఉన్న శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో శనివారం శ్రీ రాజ్య శ్యామలా గుప్తా నవరాత్రి మహోత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 10 నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాలు 18 వ తేదీ వరకు జరగనున్నాయని శక్తి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు (కరుణ స్వామి) తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు శ్రీ దేవీ కరుమారి అమ్మన్ అమ్మవారు లఘుశ్యామలాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం జరిగిన సామూహిక హోమం లో చలువాది ప్రకాష్ శైలజ, వెంకట దుర్గారావు, లక్ష్మీ దేవి, సత్యనారాయణ, హేమలత, అవుతుపల్లి చిట్టిబాబు నాగ మల్లీశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతి రోజు ఉదయం 6గంట లకు సుప్రభాత సేవ, 7 గంటలకు కలశపూజ, సహస్రనామర్చన, షోడషోపచార పూజలతో అమ్మవారి పూజ జరుగుతుంది.ఉదయం 8 గంటలకు రాజ్యశ్యామల, లఘుశ్యామల, వాగ్వాధినీ,నకులి శ్యామల అమ్మవారి మూల మంత్రములతో హోమాలు జరుగుతాయని కరుణ స్వామి తెలిపారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5నుండి 6 గంటల వరకు సాముహిక లలితా సహస్రనామ పారాయణం, 6గ నుండి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమములు, 7నుండి 8 గంటల వరకు అమ్మ వారికి విశేషహరతులు. ఉంటాయన్నారు.16 న మహా విశేషం అయిన సప్తమి శుక్రవారం సాయంత్రం లక్ష బిల్వ పత్రాలతో, దశ సహస్ర తమలపాకులతో, సహస్ర కలువ పువ్వులతో అమ్మ వారికి సహస్ర నామార్చన జరుగుతుందని స్వామి వివరించారు.