గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో డా.పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పాల్గొన్నారు.