వెలగపూడి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారని అసెంబ్లీ కార్యదర్శి డా.పిపికె రామాచార్యులు తెలిపారు. 5వ తేది సోమవారం ఉదయం 10 గం.లకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో శాసన మండలి, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.