హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు సెలవు దినంగా ప్రకటించింది.
అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను ఆ రోజు మూసి వేస్తారు.