విజయవాడ : తిరుపతి జిల్లా కలక్టర్ గా నియమితులైన డా.జి.లక్ష్మీశ గురువారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఇప్పటి వరకూ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన లక్ష్మీశను ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా తిరుపతి జిల్లా కలక్టర్ గా నియమించడం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ డా.జవహర్ రెడ్డి తిరుపతి కలక్టర్ లక్ష్మీశ కు శుభాకాంక్షలు తెలిపారు.